ఎంపీ కవితకు ఉపరాష్ట్రపతి ఫోన్‌

ABN , First Publish Date - 2020-05-13T07:01:22+05:30 IST

మహబూబాబాద్‌ ఎంపీ మాలోతు కవితకు ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు మంగళవారం ఫోన్‌చేసి ప్రజల యోగక్షేమాలను

ఎంపీ కవితకు ఉపరాష్ట్రపతి ఫోన్‌

ప్రజల యోగ క్షేమాలను తెలుసుకున్న వెంకయ్యనాయుడు 


మహబూబాబాద్‌ టౌన్‌, మే 12: మహబూబాబాద్‌ ఎంపీ మాలోతు కవితకు ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు మంగళవారం ఫోన్‌చేసి ప్రజల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కొద్ది రోజులుగా రాష్ట్రాల్లోని ఎంపీలకు ఫోన్‌ చేసి ఆ ప్రాంత పరిస్థితులపై ఉపరాష్ట్రపతి ఆరా తీస్తూ తగిన సూచనలు చేస్తున్నా రు. కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తున్నారు.


ఈ క్రమంలో మానుకోట ఎంపీ కవితకు ఫోన్‌ చేసి తన పార్లమెంటరీ నియోజకవర్గంలో కరోనా నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుందని ఉపరాష్ట్రపతికి ఎంపీ తెలిపారు. మహబూబాబాద్‌, వరంగల్‌ రూరల్‌, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల పరిధిలోని భద్రాచలం నుంచి ములుగు వరకు మానుకోట పార్లమెంటరీ నియోజకవర్గం మొత్తం గ్రీన్‌ జోన్‌లో ఉన్నట్లు వివరించినట్లు ఎంపీ కవిత చెప్పారు.

Updated Date - 2020-05-13T07:01:22+05:30 IST