Abn logo
Aug 2 2021 @ 03:13AM

యువతలో నైపుణ్యాలు పెంచాలి: వెంకయ్య

శంషాబాద్‌ రూరల్‌, ఆగస్టు 1: మార్కెట్‌లో ఉన్న డిమాండ్లకు తగ్గట్లుగా పని చేసేందుకు వీలుగా యువతలో నైపుణ్యాలు పెంచాల్సిన అవసరం ఉందని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు.  వృత్తికి సంబంధించిన నైపుణ్యాలు పెంచుకుంటే మహిళలు సాధికారత సాధించవచ్చని చెప్పారు. శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ‘జీఎంఆర్‌ వరలక్ష్మి ఫౌండేషన్‌ సెంటర్‌ ఫర్‌ ఎంపర్‌మెంట్‌ అండ్‌ లైవ్లీహుడ్‌’ను ఆదివారం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సందర్శించారు. ఫౌండేషన్‌లో శిక్షణ తీసుకుంటున్న విద్యార్థులతో ముచ్చటించారు. వరలక్ష్మి ఫౌండేషన్‌, చిన్మయ మిషన్‌ సంయుక్తంగా నిర్వహిస్తున్న జీఎంఆర్‌-చిన్మయ విద్యాలయాలను సందర్శించారు.