కొత్త వ్యాధులతో శాస్త్రవేత్తలు పోరాటానికి సిద్ధం కావాలి

ABN , First Publish Date - 2021-03-04T07:20:26+05:30 IST

‘‘కరోనా మహమ్మారి వంటి కొత్తగా పుట్టుకొస్తున్న వ్యాధులను ఆరంభంలోనే ఎదుర్కొని పోరాడేందుకు శాస్త్రవేత్తలు సిద్ధంగా ఉండాలి. కనీవినీ ఎరుగని సమస్యలను, మహమ్మారులను

కొత్త వ్యాధులతో శాస్త్రవేత్తలు పోరాటానికి సిద్ధం కావాలి

బయో ఎకానమీగా దిశగా బయోటెక్‌ రంగం 

ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు


చెన్నై, చిత్తూరు కలెక్టరేట్‌, హైదరాబాద్‌ సిటీ, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): ‘‘కరోనా మహమ్మారి వంటి కొత్తగా పుట్టుకొస్తున్న వ్యాధులను ఆరంభంలోనే ఎదుర్కొని పోరాడేందుకు శాస్త్రవేత్తలు సిద్ధంగా ఉండాలి. కనీవినీ ఎరుగని సమస్యలను, మహమ్మారులను ఎదుర్కొనే విషయంలో మనమెంత అప్రమత్తంగా ఉండాలో కరోనా నేర్పింది’’ అని భారత ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు అన్నారు. ‘గ్లోబల్‌ బయో ఇండియా-2021’ సదస్సు ముగింపు సమావేశం, అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి అంతర్జాల వేదిక ద్వారా వెంకయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన సంస్థలను ప్రకటించారు.. ఇందులో హైదరాబాద్‌ హెచ్‌సీయూలోని ఆస్‌పైర్‌ బయోనెస్ట్‌ ఉంది. ఇది దేశంలోనే అత్యుత్తమ ఇంక్యుబేటర్‌గా నిలిచింది. ఈ సంద్భంగా ఉప రాష్ట్రపతి మాట్లాడారు. కరోనా కారణంగా తలెత్తిన ఆరోగ్య సంక్షోభాన్ని నివారించేందుకు భారత బయోటెక్నాలజీ విభాగం చేసిన కృషిని ప్రశంసించారు. 2025 నాటికి రూ.11 లక్షల కోట్ల లక్ష్యంతో ముందుకెళ్తున్న భారత బయోటెక్‌ రంగం, దేశ ఆర్థిక ప్రగతిలో కీలక భూమిక పోషించేందుకు సిద్ధమవుతోందన్నారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌, బయోటెక్‌ రంగ ప్రముఖులు, శాస్త్రవేత్తలు, హాజరయ్యారు.

 

అత్యుత్తమ ఇంక్యుబేటర్‌గా హెచ్‌సీయూ యాస్పైర్‌ బయోనెస్ట్‌

హెచ్‌సీయూలోని యాస్పైర్‌ బయోనెస్ట్‌ దేశంలో అత్యుత్తమ బయో ఇంక్యుబేటర్‌గా ఎంపికైంది. ఈ ఇంక్యుబేటర్‌ను 2018లో బీఐఆర్‌ఏసీ సహాకారంతో ఏర్పాటు చేశారు. ఇందులో వ్యవసాయం, బయో టెక్నాలజీ, ఫార్మాసిటికల్‌, హెల్త్‌కేర్‌, తదితర  వాటిపై స్కేలింగ్‌ టెక్నాలజీలో ఆవిష్కరణలు చేపడుతున్నారు. ఇందులో 25 వరకు స్టార్ట్‌పలు పని చేస్తున్నాయి. ప్రొఫెసర్ల కృషి కారణంగానే దేశంలో అత్యుత్తమ ఇంక్యుబేటర్‌గా ఆస్‌పైర్‌ బయోనెస్ట్‌ ఎంపికైందని వీసీ పొదిలె అప్పారావు పేర్కొన్నారు. 

Updated Date - 2021-03-04T07:20:26+05:30 IST