ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రాక రేపు

ABN , First Publish Date - 2022-01-18T05:49:16+05:30 IST

భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు మూడు రోజుల పర్యటన నిమిత్తం ఈ నెల 19న విశాఖపట్నం వస్తున్నారు.

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రాక రేపు

విశాఖపట్నం, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు మూడు రోజుల పర్యటన నిమిత్తం ఈ నెల 19న విశాఖపట్నం వస్తున్నారు. బుధవారం ఆయన విజయవాడ నుంచి భారత వైమానిక దళం ప్రత్యేక విమానంలో విశాఖపట్నం వస్తారు. ఆ రోజు రాత్రి పోర్టు అతిథిగృహంలో బస చేస్తారు. 20వ తేదీన ఇండియన్‌ సైకియాట్రిక్‌ సొసైటీ వార్షిక జాతీయ సదస్సులో పాల్గొంటారు. 21న పెట్రోలియం యూనివర్సిటీ మొదటి కాన్వొకేషన్‌కు ముఖ్య అతిథిగా హాజరవుతారు. 22న ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌ వెళతారు.  


తరగతి గదుల్లో వివక్ష వద్దు 

విద్యార్థులందరినీ బెంచీలపై కూర్చోబెట్టాలి

ఎక్కడైనా కింద కూర్చోబెట్టినట్టయితే ఉపాధ్యాయులపై చర్యలు

విద్యా శాఖ ఉత్తర్వులు


భీమునిపట్నం-రూరల్‌, జనవరి 17: ఉన్నత పాఠశాలల్లోని తరగతి గదుల్లో విద్యార్థులకు బెంచీలు ఏర్పాటుచేసే విషయంలో వివక్ష చూపించరాదంటూ విద్యా శాఖ తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. బెంచీలు తక్కువగా వుండడం వల్ల కొంతమంది విద్యార్థులు నేలపై కూర్చుంటున్నారని, ఈ విధానం సరికాదని పేర్కొంది. ఏ తరగతి గదిలోనైనా విద్యార్థులు బెంచీలు చాలక కిందన కూర్చున్నట్టు అధికారుల దృష్టికి వస్తే ఉపాధ్యాయులపై చర్యలు తీసుకుంటామని పేర్కొంది. విద్యార్థులందరికీ సరిపడేలా బెంచీలు లేకపోతే వాటిని తీసివేసి అందరినీ కిందనే కూర్చోబెట్టాలని ఉత్తర్వులలో స్పష్టం చేసింది. 

Updated Date - 2022-01-18T05:49:16+05:30 IST