ఆ మాటలు రోత పుట్టిస్తున్నాయి: ఉపరాష్ట్రపతి

ABN , First Publish Date - 2021-11-13T01:06:57+05:30 IST

ఈ రోజుల్లో రాజకీయ నాయకులు చేస్తున్న చేష్టలు, మాట్లాడే మాటలు

ఆ మాటలు రోత పుట్టిస్తున్నాయి: ఉపరాష్ట్రపతి

నెల్లూరు: ఈ రోజుల్లో రాజకీయ నాయకులు చేస్తున్న చేష్టలు, మాట్లాడే మాటలు రోత పుట్టిస్తున్నాయని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరులోని ఓ స్థానిక పత్రిక 40ఏళ్ల వార్షికోత్సవంలో ఉపరాష్ట్రపతి  పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు మాటలు, తెలుగు కట్టు, బొట్టు చాలారోజుల తరువాత చూడటం సంతోషంగా ఉందన్నారు. ఈ రాజ్యాంగ హోదా అలంకారంగా కనిపిస్తోందన్నారు.


జనంతో కలిసి జనంతో మాట్లాడుతుంటే దానిలో ఉండే ఆనందం ఈ రాజ్యాంగ హోదాలో లేదన్నారు. సంతోషంగా ఉండాలంటే అందరితో కలిసి తిరగాలని ఆయన సూచించారు. చదువు చెప్పిన గురువుని సన్మానించుకోవడం మన బాధ్యత అని ఆయన అన్నారు. కరోనాను ఎదిరించడంలో ముందుండి అశువులు బాసిన జర్నలిస్టులు, వైద్యసిబ్బందికి ఆయన నివాళులర్పించారు. అనంతరం 40 మంది నెల్లూరు ప్రముఖులకు జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతిని సన్మానించారు. 

Updated Date - 2021-11-13T01:06:57+05:30 IST