రాయదుర్గంలో వలీబాషాను వరించిన వైస్‌చైర్మన పీఠం

ABN , First Publish Date - 2021-07-31T06:35:06+05:30 IST

స్థానిక పురపాలక సంఘం రెండవ వైస్‌ చైర్మనగా జీ వలీబాషా ఎన్నికయ్యారు. శుక్రవారం మున్సిపల్‌ కార్యాలయంలోని కౌన్సిల్‌ సమావేశ భవనంలో రెండ వ వైస్‌ చైర్మన ఎన్నికకు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు.

రాయదుర్గంలో వలీబాషాను వరించిన వైస్‌చైర్మన పీఠం
వలీబాషాను సన్మానిస్తున్న మున్సిపల్‌ చైర్‌పర్సన శిల్ప

రాయదుర్గం టౌన, జూలై 30: స్థానిక పురపాలక సంఘం రెండవ వైస్‌ చైర్మనగా జీ వలీబాషా ఎన్నికయ్యారు. శుక్రవారం మున్సిపల్‌ కార్యాలయంలోని కౌన్సిల్‌ సమావేశ భవనంలో రెండ వ వైస్‌ చైర్మన ఎన్నికకు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఎ న్నికల అధికారిగా డిప్యూటీ కలెక్టర్‌ కేశవనాయుడు వ్యవహరించా రు. 5వ వార్డు కౌన్సిలర్‌ జీ వలీబాషాను మున్సిపల్‌ వైస్‌ చైర్మనగా 23వ వార్డు కౌన్సిలర్‌ ఎన పద్మజ ప్రతిపాదించారు. 6వ వార్డు కౌన్సిలర్‌ తట్టె మంజు బలపరిచారు. దీంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ప్రకటిస్తూ ప్రొసీడింగ్‌ కాపీ అందజేశారు. అనంతరం ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం మున్సిపల్‌ చైర్‌పర్సన పొరాళ్లు శిల్ప, వైస్‌ చైర్మన శ్రీనివాసయాదవ్‌, కమిషనర్‌ జబ్బార్‌మియా, డీఈ రామ్మూర్తి, ఏఈ వీరేష్‌, శానిటరీ ఇనస్పెక్టర్‌ రవీంద్ర, టీపీఎస్‌ అబ్దుల్‌ సత్తార్‌, కౌన్సిల్‌ స భ్యులు, కోఆప్షన మెంబర్లు ఘనంగా సన్మానించారు. శాలువా, పూ లమాలలు వేసి మిఠాయిలు తినిపించారు. ఈసందర్భంగా నూత న రెండవ వైస్‌చైర్మన విలేకరులతో మాట్లాడుతూ పురపాలక సంఘం అభివృద్ధికి తనవంతు కృషి చేస్తామన్నారు.


సాదాసీదాగా మున్సిపల్‌ సాధారణ సమావేశం 

మున్సిపల్‌ సాధారణ సమావేశం శుక్రవారం సాదాసీదాగా ము గిసింది. పురపాలక సంఘం కార్యాలయంలోని కౌన్సిల్‌ సమావేశ భవనంలో మున్సిపల్‌ చైర్‌పర్సన పొరాళ్లు శిల్ప అధ్యక్షతన సాధారణ సమావేశాన్ని నిర్వహించారు. ఎజెండాలోని ఆరు అంశాలను కౌన్సిల్‌ సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించారు.

Updated Date - 2021-07-31T06:35:06+05:30 IST