ఆర్థిక వ్యవస్థ త్వరలో గాడిన పడుతుంది

ABN , First Publish Date - 2021-01-19T07:15:10+05:30 IST

కరోనా కారణంగా మందగించిన మన దేశ ఆర్థిక వ్యవస్థ త్వరలోనే గాడినపడుతుందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు.

ఆర్థిక వ్యవస్థ త్వరలో గాడిన పడుతుంది
ప్రసంగిస్తున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

ఐసీఎస్‌ఐ స్నాతకోత్సవంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

హైదరాబాద్‌ సిటీ, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): కరోనా కారణంగా మందగించిన మన దేశ ఆర్థిక వ్యవస్థ త్వరలోనే గాడినపడుతుందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంలో కార్పొరేట్‌ రంగం మరింత చొరవ తీసుకోవాల్సిన అవసరముందన్నారు. హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కంపెనీ సెక్రటరీస్‌ ఆఫ్‌ ఇండియా జాతీయ ఈ స్నాతకోత్సవంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. కరోనా వ్యాప్తిని అడ్డుకోవడంలో అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఇబ్బందులు పడిన సందర్భంలో దేశం కొంత మేర విజయం సాధించిందన్నారు. ఆత్మనిర్భర్‌ భారత్‌ నినాదంతో ముందుకెళుతున్న దేశ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడంలో కంపెనీ సెక్రటరీల పాత్ర చాలా కీలకమన్నారు. దుబాయ్‌, అమెరికా, బ్రిటన్‌, సింగపూర్‌లోనూ కార్యకలాపాలను ప్రారంభించిన ఐసీఎ్‌సఐను ఆయన అభినందించారు. ఆన్‌లైన్‌ వేదికగా నిర్వహించిన కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్‌ అలీ, ఐసీఎ్‌సఐ అధ్యక్షుడు అశిశ్‌గార్గ్‌, కార్యదర్శి ఆశి్‌షమోహన్‌, సహకార్యదరద్శి అంకుర్‌ యాదవ్‌తోపాటు కంపెనీ సెక్రటరీ పట్టభద్రులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-19T07:15:10+05:30 IST