త్రిపుర సర్కారుకు వెంకయ్య హెచ్చరిక..

ABN , First Publish Date - 2021-10-08T17:04:36+05:30 IST

అవినీతి విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని విప్లవ్ కుమార్ దేవ్ సారథ్యంలోని..

త్రిపుర సర్కారుకు వెంకయ్య హెచ్చరిక..

అగర్తలా: అవినీతి విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని విప్లవ్ కుమార్ దేవ్ సారథ్యంలోని బీజేపీ-ఐపీఎఫ్‌టీ ప్రభుత్వాన్ని ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు హెచ్చరించారు. డైల్యూషన్, డీవియేషన్, డీరైల్‌మెంట్ (3డీ)ల పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు. త్రిపుర ప్రభుత్వం తనకు జరిపిన పౌరసన్మాన కార్యక్రమంలో వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, బంగ్లాదేశ్, త్రిపుర మధ్య ఫెని నదిపై మోత్రీసేతు ప్రారంభంతో అభివృద్ధి అనేక రెట్లు మెరగవుతుందని అన్నారు. అగర్తలా-అకౌరా రైల్వే లింక్, ఇండో-బంగ్లాదేశ్ వాటర్‌వేస్‌ ఏర్పాటుతో త్రిపుర మరింత అభివృద్ధి సాధించగలదని అన్నారు.


2004లో తాను అగర్తలాలో ఉన్నానని, అప్పటికీ ఇప్పటికీ వచ్చిన మార్పులు చాలా సంతోషం కలిగిసోందని చెప్పారు. ఈ మార్పులు చాలా వేగవంతంగా చోటుచేసుకున్నాయని చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న అభివృద్ధి ప్రాజెక్టుల్లో పురోగతి బాగుందని అన్నారు. పౌరసన్మానం అనంతరం సెల్ఫ్ హెల్త్ గ్రూపులు, కోవిడ్ ఫ్రంట్ లైన్ వర్కర్లుతో ఉప రాష్ట్రపతి సమావేశమై వారి సేవలను ప్రశంసించారు. అగర్తలా స్మార్ట్ సిటీ మిషన్‌ను ప్రారంభించారు. ఇంఫాల్‌లో రెండు రోజుల పర్యటన కోసం వెంకయ్యనాయుడు ఇక్కడకు వచ్చారు. దీనికి ముందు అసోం, మేఘాలయ, మణిపూర్‌లలో ఆయన పర్యటించిన ఆయా రాష్ట్రాల్లో పలు అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించారు.

Updated Date - 2021-10-08T17:04:36+05:30 IST