బంజారాహిల్స్, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): షేక్‌పేట తహసీల్దార్ శ్రీనివా్‌సరెడ్డి, బంజారాహిల్స్ కార్పొరేటర్ గద్వాల విజయలక్ష్మి మధ్య తలెత్తిన వివాదంపై బంజారాహిల్స్ పోలీసులు విచారణ ప్రారంభించారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించినందుకు తహసీల్దార్ తనపట్ల అమర్యాదగా ప్రవర్తించారని విజయలక్ష్మి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం విదితమే. ఇదే కేసులో తమ విధులకు ఆటంకం కలిగిస్తూ కార్పొరేటర్ తన మనుషులతో కార్యాలయంలోకి వచ్చి తమపై దాడి చేసేందుకు యత్నించారని తహసీల్దార్ ఫిర్యాదు చేశారు. పోలీసులు సీసీ టీవీల ఫుటేజీలను పరిశీలించడంతోపాటు, ప్రత్యక్ష సాక్షులను విచారిస్తున్నారు.