Sep 24 2021 @ 14:59PM

జలియన్‌వాలాభాగ్ ఘటనకు పగ తీర్చుకున్న వీరుడిపై సినిమా..రిలీజ్ డేట్ ఫిక్స్..!

ముంబై: ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి సినిమాల్లో నిలదొక్కుకున్న నటుడు విక్కీకౌశల్. ఆయన ప్రధాన పాత్రలో నటించిన  చిత్రం సర్దార్ ఉధం. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్‌లో అక్టోబర్‌లో విడుదల కానుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయన ఈ ప్రకటన చేశారు. ఈ సినిమా జనవరిలోనే విడుదల కావాల్సి ఉన్న, అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. ఈ సినిమా టైటిల్ నుంచి సింగ్ అనే పదం తొలగిస్తున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. ఈ చిత్రానికి సూజిత్ సర్కార్ దర్శకత్వం వహించగా, రోని లహిరి, శీల్ కుమార్ నిర్మించారు. విక్కీ ఈ మధ్యనే ఈ చిత్రానికి డబ్బింగ్‌ను పూర్తిచేశారు. విప్లవకారుడి చిత్రాన్ని మీ ముందుకు తీసుకువస్తునందుకు నా హృదయం ఉప్పొంగిపోతోందన్నారు. అక్టోబర్‌లో ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్‌లో వీక్షించడన్నారు.


అమృత్‌సర్‌లో ఏప్రిల్ 13, 1919న జలియన్‌వాలాభాగ్ కాల్పులు చోటుచేసుకున్నాయి. ఆ సమయంలో పంజాబ్ లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌గా మైకేల్ ఓ డయ్యర్ ఉన్నారు. ఈ కాల్పులకు ప్రతీకారంగా సర్దార్ ఉధంసింగ్ చదువుకునేందుకు బ్రిటన్ వెళ్లి మరి 1940లో డయ్యర్‌ను చంపేశారు. ఉధంసింగ్ జీవితం ఆధారంగా ఈ సినిమాను నిర్మించారు.