Oct 17 2021 @ 16:00PM

Vicky Kaushal: డేటింగ్ వదంతులపై స్పందించిన విక్కీ కౌశల్.. త్వరలో నిశ్చితార్థం చేసుకుంటానంటున్న హీరో

హీరో, హీరోయిన్లు పెళ్లి చేసుకోవడం అనేది సాధారణ విషయమే. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ఏ ఇండస్ట్రీ ఇందుకు అతీతం కాదు. నాగార్జున-అమల, దీపికా పదుకొనే-రణ్ వీర్ సింగ్ ఇలా ఒక్కటయిన వారే. త్వరలో ఆలియాభట్ -రణ్ బీర్ కపూర్, రకుల్ ప్రీత్ సింగ్-జాకీ భగ్నానీ వివాహ బంధంలోకి అడుగు పెట్టనున్నారు. ఇలా సినీ జంటలు పెళ్లి పీటలకు ఎక్కబోతున్న తరుణంలో బాలీవుడ్‌ నుంచి  కత్రినా కైఫ్- విక్కీ కౌశల్ గత కొంతకాలంగా డేటింగ్ చేస్తున్నారని వార్తలు వెలువడుతున్నాయి. 


తన మీద వస్తున్న వదంతులపై విక్కీ కౌశల్ స్పందించారు. త్వరలోనే తను నిశ్చితార్థం చేసుకోబోతున్నానని చెప్పారు. సరైన సమయంలో తను పెళ్లి చేసుకుంటానని వివరించారు. ఆ సమయం తప్పక వస్తుందని స్పష్టం చేశారు. తాజాగా విక్కీ కౌశల్ హీరోగా నటించిన సర్దార్ ఉద్దం సినిమా అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది. బాలీవుడ్ సెలెబ్రిటీలకు ఈ సినిమా స్పెషల్ స్ర్కీనింగ్‌ను ఏర్పాటు చేశారు. ఆ ఈవెంట్ కు కత్రినా కైఫ్ హాజరు కావడం విశేషం. సర్దార్ ఉద్దమ్‌లో విక్కీ కౌశల్ ఫర్‌ఫార్మెన్స్‌ను మెచ్చుకుంటూ ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం గమనార్హం.  


ఉద్దం సింగ్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని ‘‘సర్దార్ ఉద్దం’’ సినిమాను నిర్మించారు. అమృత్ సర్‌లోని జలియన్ వాలాబాగ్‌లో 1919లో మైకేల్ ఓ. డయ్యర్ అనే బ్రిటిష్ అధికారి కాల్పులకు పాల్పడ్డారు. ఉద్దంసింగ్ దారుణ హత్యకాండకు ప్రతీకారం తీర్చుకోవాలని లండన్ వెళ్లి మరి డయ్యర్‌ను హత్య చేశారు. ఆ సినిమాకు సూజిత్ సర్కార్ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది.

Bollywoodమరిన్ని...