బాధితురాలి కుటుంబం సంతృప్తితో ఉంది: ఫరీదాబాద్ ఉదంతంపై ఖట్టర్

ABN , First Publish Date - 2020-10-30T20:46:22+05:30 IST

నికిత తోమర్ (21) అనే యువతిని తౌఫిక్ అనే వ్యక్తి కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించి, అది విఫలం కావడంతో ఆమెను నడి రోడ్డుపై కాల్చి చంపాడు. ఈ దారుణం హరియాణాలోని ఫరీదాబాద్‌లో జరిగింది.

బాధితురాలి కుటుంబం సంతృప్తితో ఉంది: ఫరీదాబాద్ ఉదంతంపై ఖట్టర్

న్యూఢిల్లీ: ఫరీదాబాద్‌లో జరిగిన ఉదంతంపై ప్రభుత్వం తీసుకున్న చర్యల పట్ల బాధితురాలి కుటుంబం సంతృప్తిగా ఉందని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అన్నారు. హత్య జరిగిన రెండు గంటల్లోనే నేరస్తులను పట్టుకున్నామని, అంతే కాకుండా వారికి సహాయ పడిన వారిని కూడా పట్టుకున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ కేసును ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపిస్తామని, ఇప్పటికే ఆ తతంగం అంతా పూర్తైందని తెలిపారు. నేరానికి పాల్పడ్డ వారిపై గట్టి చర్యలు ఉంటాయని హర్యానా సీఎం మనోహార్ లాల్ ఖట్టర్ అన్నారు.


నికిత తోమర్ (21) అనే యువతిని తౌఫిక్ అనే వ్యక్తి కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించి, అది విఫలం కావడంతో ఆమెను నడి రోడ్డుపై కాల్చి చంపాడు. ఈ దారుణం హరియాణాలోని ఫరీదాబాద్‌లో జరిగింది. యువతి కాలేజీ నుంచి బయటకి వస్తన్న సమయంలో ఈ దారుణం జరిగింది. తౌఫిక్‌తో పాటు మరో స్నేహితుడు కూడా ఇందుకు సహకరించాడు. ఈ దారుణం దేశ వ్యాప్తంగా కలకలం రేపింది.

Updated Date - 2020-10-30T20:46:22+05:30 IST