Abn logo
Jul 7 2020 @ 19:53PM

ఆ మలయాళ రీమేక్‌లో వెంకీ అంటున్నారు

టాలీవుడ్ కన్ను ఇప్పుడు మలయాళ సినీ ఇండస్ట్రీపై ఉంది. అక్కడ సంచలన విజయం సాధించిన చిత్రాలను ఇక్కడకు తెచ్చేందుకు ఇక్కడి నిర్మాతలు పోటీ పడుతున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి ‘లూసిఫర్’ రీమేక్‌కు ప్లాన్ చేస్తున్నారు. ఆ చిత్రంతో పాటు ‘అయ్యప్పనుమ్ కోషియమ్, కప్పెలా, డ్రైవింగ్ లైసెన్స్, హెలెన్’ వంటి చిత్రాలను కూడా టాలీవుడ్‌లో రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీటిలో ‘లూసిఫర్’తో పాటు ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ చిత్రం పేరు టాలీవుడ్‌లో బాగా వినబడుతుంది. ఈ చిత్రంలో ఇద్దరు ప్రముఖ హీరోలు నటించనున్నారనే వార్తలతో పాటు ఆ ఇద్దరి హీరోల విషయంలో రోజుకోక పేరు వినిపిస్తుంది.


తాజాగా ఈ లిస్ట్‌లోకి విక్టరీ వెంకటేష్ వచ్చి చేరారు. అసలైతే రవితేజ, రానా దగ్గుబాటి కన్ఫర్మ్ అయ్యారనే వార్తలు ఇటీవల టాలీవుడ్‌లో గట్టిగానే వినిపించాయి. ఇప్పుడు రవితేజ ప్లేస్‌లో వెంకటేష్ అంటూ వార్తలు బయటికి వచ్చాయి. అయితే రానా ఏమో గానీ వెంకటేష్ ఈ చిత్రంలో చేయడం సాధ్యమయ్యే పని కాదని తెలుస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం ‘నారప్ప’ చిత్రంతో వెంకీ బిజీగా ఉన్నారు. ఆ తర్వాత అనిల్ రావిపూడి ‘ఎఫ్3’ అంటూ రెడీగా ఉన్నాడు. మరో వైపు కరోనా మహమ్మారి షూటింగ్స్‌ను చేసుకోనివ్వడం లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో వెంకీ ఆ చిత్ర రీమేక్‌లో చేయడం కష్టమే అని చెప్పకతప్పదు. ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ రీమేక్ రైట్స్‌ను ప్రముఖ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ దక్కించుకుంది. ఇకనైనా ఈ చిత్రంపై ఆ సంస్థ క్లారిటీ ఇస్తే బాగుంటుంది. లేదంటే ఇలా రోజుకొక వార్త పుట్టుకొస్తూనే ఉంటుంది.

Advertisement
Advertisement
Advertisement