గెలుపు వాకిట ఇంగ్లండ్‌

ABN , First Publish Date - 2021-01-18T09:47:52+05:30 IST

శ్రీలంకతో తొలి టెస్ట్‌లో పర్యాటక ఇంగ్లండ్‌ గెలుపు దిశగా సాగుతోంది. ఓపెనర్‌ లాహిరు తిరిమన్నె (111) సెంచరీతో రాణించడంతో.

గెలుపు వాకిట ఇంగ్లండ్‌

గాలె: శ్రీలంకతో తొలి టెస్ట్‌లో పర్యాటక ఇంగ్లండ్‌ గెలుపు దిశగా సాగుతోంది. ఓపెనర్‌ లాహిరు తిరిమన్నె (111) సెంచరీతో రాణించడంతో.. ఓవర్‌నైట్‌ స్కోరు 156/2తో నాలుగో రోజైన ఆదివారం రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన లంక 359 వద్ద ఆలౌటైంది. ఏంజెలో మాథ్యూస్‌ (71) అర్ధ సెంచరీ చేశాడు. జాక్‌ లీచ్‌ (5/122) ఐదు వికెట్లు పడగొట్టాడు. డామ్‌ బెస్‌ 3, సామ్‌ కర్రాన్‌ 2 వికెట్లు తీశారు. అనంతరం 74 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్‌ ఆట చివరకు 38/3 స్కోరు చేసింది. రూట్‌ సేన విజయానికి కేవలం 36 పరుగుల దూరంలో ఉంది. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో లంక 135, ఇంగ్లండ్‌ 421 రన్స్‌ చేశాయి. 

Updated Date - 2021-01-18T09:47:52+05:30 IST