GMAILలో మాట్లాడుకోండిలా...!

ABN , First Publish Date - 2020-05-16T05:30:00+05:30 IST

లాక్‌డౌన్‌ వేళ వర్క్‌ ఫ్రం హోమ్‌ బాగా పెరిగింది. వీడియో కాన్ఫరెన్సింగ్‌ ప్లాట్‌ఫామ్‌లకు డిమాండ్‌ పెరిగింది. దీంతో గూగుల్‌ సంస్థ ‘గూగుల్‌ మీట్‌’ పేరుతో వీడియో కాల్స్‌ చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది...

GMAILలో  మాట్లాడుకోండిలా...!

లాక్‌డౌన్‌ వేళ వర్క్‌ ఫ్రం హోమ్‌ బాగా పెరిగింది. వీడియో కాన్ఫరెన్సింగ్‌ ప్లాట్‌ఫామ్‌లకు డిమాండ్‌ పెరిగింది. దీంతో గూగుల్‌ సంస్థ ‘గూగుల్‌ మీట్‌’ పేరుతో వీడియో కాల్స్‌ చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. జీమెయిల్‌ అకౌంట్‌ ఉన్న ప్రతి ఒక్కరూ ఉచితంగా ఈ ఫీచర్‌ను ఉపయోగించుకోవచ్చు. 

‘గూగుల్‌ మీట్‌’ ఫీచర్‌ నేరుగా జీమెయిల్‌లోనే కనిపిస్తుంది. జీమెయిల్‌ అకౌంట్‌లోకి సైనప్‌ అయితే చాలు... వీడియో కాల్‌ చేసుకోవచ్చు. జీమెయిల్‌ అకౌంట్‌ లేకుండా, గూగుల్‌ అకౌంట్‌ మాత్రమే ఉన్నా గూగుల్‌ మీట్‌ను ఉపయోగించుకోవచ్చు. జీ-సూట్‌ వినియోగదారులైతే ఆ అకౌంట్‌లోకి సైనిన్‌ అయిన తరువాత వీడియోకాల్‌ చేసుకోవచ్చు. మిగతా వినియోగదారులు జీమెయిల్‌ అకౌంట్‌లో నుంచి ఉపయోగించుకోవచ్చు.


మీటింగ్‌ ప్రారంభించాలంటే...!

  1. ముందుగా జీమెయిల్‌ ఓపెన్‌ చేయాలి.
  2.  స్ర్కీన్‌లో ఎడమ వైపున ‘స్టార్ట్‌ ఏ మీటింగ్‌’, ‘జాయిన్‌ ఎ మీటింగ్‌’ అని రెండు ఆప్షన్లు కనిపిస్తాయి.
  3. అందులో ‘స్టార్ట్‌ ఎ మీటింగ్‌’ పై క్లిక్‌ చేయాలి. ఈ ఆప్షన్‌ను ఎంచుకొనే ముందు కెమెరా, మైక్రోఫోన్‌ ఆన్‌లో ఉండేలా చూసుకోవాలి. మీటింగ్‌ కోడ్‌, ఇతర వివరాలు కుడివైపున కనిపిస్తాయి.
  4. వీడియో కాల్‌ చేయడానికి ‘జాయిన్‌ నౌ’ పై క్లిక్‌ చేయాలి.
  5. ఇప్పుడు మీటింగ్‌ వివరాలతో కూడిన మరో విండో కనిపిస్తుంది. ఇక్కడ ఇతర వ్యక్తులను మీటింగ్‌కి జత చేసుకోవచ్చు.
  6. మీటింగ్‌ కోడ్‌ని షేర్‌ చేయాలంటే ‘కాపీ జాయినింగ్‌ ఇన్ఫో’పై క్లిక్‌ చేసి లింక్‌ను షేర్‌ చేసుకోవచ్చు.
  7. మెయిల్‌ ద్వారా ఇన్‌వైట్‌ చేయాలంటే ‘యాడ్‌ పీపుల్‌’పై క్లిక్‌ చేసి పేరు, ఈమెయిల్‌ అడ్రస్‌ ఎంటర్‌ చేస్తే సరిపోతుంది.
  8. ఫోన్‌ ద్వారా అయితే ‘యాడ్‌ పీపుల్‌’పై క్లిక్‌ చేసి, ‘కాల్‌’ని ఎంచుకొని ఫోన్‌ నెంబర్‌ని ఎంటర్‌ చేయాలి.


వీడియో కాల్‌లో జాయిన్‌ కావాలంటే...!

  1. జీమెయిల్‌ ఓపెన్‌ చేయాలి.
  2. ‘జాయిన్‌ ఏ మీటింగ్‌’ పై క్లిక్‌ చేయాలి.
  3. ఇప్పుడు మీటింగ్‌ కోడ్‌ ఎంటర్‌ చేయమని అడుగుతుంది. ఇక్కడ పది అక్షరాల మీటింగ్‌ కోడ్‌ని ఎంటర్‌ చేయాలి. ఈ కోడ్‌ను మీటింగ్‌ను ఆర్గనైజ్‌ చేస్తున్న వ్యక్తి మీకు పంపిస్తారు.
  4. కోడ్‌ ఎంటర్‌ చేశాక ‘జాయిన్‌’పై క్లిక్‌ చేయాలి. కెమెరా, మైక్రోఫోన్‌ ఆన్‌లో ఉండేలా చూసుకోవాలి.
  5. ‘జాయిన్‌ నౌ’ ని ఎంచుకోవడం ద్వారా వీడియో కాల్‌ మాట్లాడుకోవచ్చు.

Updated Date - 2020-05-16T05:30:00+05:30 IST