సమర్థవంతంగా ఈవీఎంలు, వీవీ ప్యాడ్‌ల నిర్వహణ

ABN , First Publish Date - 2021-04-11T04:35:53+05:30 IST

తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో ఈవీఎంలు, వీవీప్యాడ్ల నిర్వహణ సమర్థవంతంగా ఉండాలని కలెక్టర్‌ చక్రధర్‌బాబు అధికారులను ఆదేశించారు.

సమర్థవంతంగా ఈవీఎంలు, వీవీ ప్యాడ్‌ల నిర్వహణ
వీడియోకాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న కలెక్టర్‌ చక్రధర్‌బాబు

వీడియోకాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌


నెల్లూరు(హరనాథపురం), ఏప్రిల్‌ 10 : తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో ఈవీఎంలు, వీవీప్యాడ్ల నిర్వహణ సమర్థవంతంగా ఉండాలని కలెక్టర్‌ చక్రధర్‌బాబు అధికారులను ఆదేశించారు. ఆయన శనివారం కలెక్టరేట్‌లోని తిక్కన భవన్‌ నుంచి వీడియోకాన్ఫరెన్స్‌ద్వారా అధికారులతో మాట్లాడారు. ఎన్నికల పరిశీలకులు దినేష్‌ కుమార్‌ మాట్లాడుతూ ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ఈవీఎంలు, వీవీప్యాడ్స్‌ నిర్వహణ చేపట్టాలన్నారు. జాయింట్‌ కలెక్టర్‌ బాపిరెడ్డి  ఈవీఎం, వీవీప్యాడ్స్‌ను పోలింగ్‌ కేంద్రాలకు కేటాయించటం, వీవీప్యాడ్స్‌ సెట్టింగ్‌, మాక్‌ పోల్‌ నిర్వహణ తదితర అంశాలపై ఏడు నియోజకవర్గాల రిటర్నింగ్‌ అధికారులకు పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ద్వారా వివరించారు.


పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం ఫెసిలిటేషన్‌ సెంటర్లు 


నెల్లూరు(హరనాథపురం), ఏప్రిల్‌ 10 : తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల విధుల్లో  పాల్గొనే సిబ్బంది, అధికారులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఫెసిలిటేషన్‌ సెంటర్లను ఏర్పాటు చేశామని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ చక్రధర్‌బాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఓపీవోలు, పోలీస్‌ సిబ్బంది, మైక్రో అబ్జర్వర్లు,  వీడియోగ్రాఫర్లు, ఇతర సిబ్బంది ఈనెల 11న ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు, పీవోలు, ఏపీవోలు ఈనెల 12న ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు  పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవచ్చునని తెలిపారు.

Updated Date - 2021-04-11T04:35:53+05:30 IST