వీడియో క్రాపింగ్‌ డిజైన్‌ యువర్‌ స్కిల్స్‌

ABN , First Publish Date - 2021-02-06T06:03:57+05:30 IST

వీడియో ఏదైనా కంటికి ఇంపుగా ఉండాలంటే కొన్ని హంగులు చేర్చక తప్పదు. అప్పుడే అది వీక్షకాదరణ పొందుతుంది. వీడియో పొడవు,

వీడియో క్రాపింగ్‌  డిజైన్‌ యువర్‌ స్కిల్స్‌

వీడియో ఏదైనా కంటికి ఇంపుగా ఉండాలంటే కొన్ని హంగులు చేర్చక తప్పదు. అప్పుడే అది వీక్షకాదరణ పొందుతుంది. వీడియో పొడవు, వెడల్పు, నిడివి తగ్గించాలి లేదా పెంచాలంటే క్రాపింగ్‌ చేయాలి. చాలా సందర్భాల్లో వీడియో డైమన్షన్స్‌లో మార్పులు అవసరమవుతాయి. ఇంకా ఏవైనా చేర్చాల్సి రావచ్చు.  సరైన యాప్‌ ఉంటే కొద్దిపాటి సాంకేతిక నైపుణ్యం, చిన్నపాటి కృషితో ఆ పని కానిచ్చేయవచ్చు. 




ఆండ్రాయిడ్‌


 ‘ప్లే స్టోర్‌’ నుంచి ‘యూకట్‌’ యాప్‌ని డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.

 ‘యూకట్‌’లోకి అవసరమైన వీడియో తీసుకునేందుకు ప్లస్‌ సింబల్‌ని టాప్‌ చేయాలి.

 ఎడిటింగ్‌ టూల్‌ బార్‌ని ఎడమవైపు స్వైప్‌ చేసి, క్రాప్‌ బటన్‌ని టాప్‌ చేయాలి.

 కోరుకున్న ఫ్రేమ్‌లోకి కోరుకున్న విధంగా అంచులను తెచ్చుకోవాలి. అందుకు అనుగుణంగా డ్రాగ్‌ చేసుకోవాలి. 

 క్రాప్‌ అయిన ఫ్రేమ్‌ చూసేందుకు టిక్‌ సింబల్‌పై టచ్‌  చేయాలి.

వీడియో రిజల్యూషన్‌, నాణ్యత కోసం సేవ్‌ బటన్‌ నొక్కాలి. తదుపరి ఫోన్‌లో ఉన్న ‘యూకట్‌’ ఫోల్డర్‌లోకి పంపుకోవాలి.



ఐఫోన్‌


ఐఫోన్‌లోనే వీడియో ఎడిటర్‌ ఉంటుంది. ఇన్‌బిల్ట్‌ అన్నమాట. ఐఔస్‌పై ఉండే వీడియో ఎడిటర్‌ క్రాపింగ్‌, సైజింగ్‌కు ఉపయోగపడుతుంది. 

 ఫొటో యాప్‌ని ఆరంభించాలి. క్రాప్‌ చేయాలని అనుకుంటున్న వీడియోను తీసుకోవాలి. 

 ఎడిట్‌ బటన్‌ను టాప్‌ చేయాలి.

 క్రాప్‌ అండ్‌ రొటేషన్‌ బటన్‌ని సెలెక్ట్‌ చేసుకోవాలి. వీడియో ఎడిటర్‌ బాటమ్‌లో ఇది ఉంటుంది. 

 కోరుకున్న పొజిషన్స్‌ దగ్గరకు అంచులను డ్రాగ్‌ చేయాలి. ప్రత్యామ్నాయం కూడా ఉంది. టాప్‌ రైట్‌ కార్నర్‌లో ఉండే రెక్టాంగల్‌ ఐకాన్‌ను సెలెక్ట్‌ చేసి అవసరమైన షేప్‌ చేసుకోవచ్చు. 

వీడియో క్రాప్‌ చేసేందుకు డన్‌పై టాప్‌ చేయాలి. రివర్స్‌బుల్‌ ప్రాసెస్‌ ఇది అని తెలుసుకోవాలి. తదుపరి ఫొటోను ఎడిటర్‌ మోడ్‌లో క్లిప్‌ చేయాలి. క్రాప్‌ ఫంక్షన్‌ను మళ్లీ ఎంపిక చేసుకోవాలి. అప్పుడు రివర్ట్‌ను సెలెక్ట్‌ చేసుకోవచ్చు. దాంతో ఒరిజినల్‌ రిజల్యూషన్‌కు వస్తుంది. 



విండోస్‌ 10


www.videosoftdev.com  నుంచి విఎస్‌డిసి వీడియో ఎడిటర్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. ఇంపోర్ట్‌ కంటెంట్‌ని క్లిక్‌ చేసి అనుకున్న వీడియోని బ్రౌజ్‌చేయాలి. 

 ప్రాజెక్టుకు పేరు పెట్టి  ఫినిష్‌ దగ్గర క్లిక్‌ చేయాలి. 

 మెనూ నుంచి ఎడిటర్‌ను క్లిక్‌ చేయాలి. క్రాప్‌ ఐకాన్‌పై క్లిక్‌ చేయాలి. 

 వీడియోస్‌ కొత్త డైమన్షన్స్‌ను సెట్‌ చేసేందుకు సరికొత్త బాక్స్‌ ఒకటి కనిపిస్తుంది. ఒకసారి సెట్‌ చేసిన తరవాత సెట్‌ ద ఒరిజినల్‌ సైజ్‌పై క్లిక్‌ చేయాలి. ఆబ్జెక్టు రేషియోను అనుసరించి సెట్‌ సైజ్‌ చేసుకోవాలి. సెట్‌  విడ్త్‌ను సెట్‌ చేయాలి. పొజిషన్‌ను రీసెట్‌ చేసి విడ్త్‌కు మాదిరిగానే సెట్‌ చేయాలి. ఫ్రేమ్‌ ఏ సైడ్‌లోనూ అవాంఛిత సైజ్‌ లేదన్నది చెక్‌ చేసుకోవాలి. చివరగా ఓకే క్లిక్‌ చేయాలి. 

 ఎక్స్‌పోర్ట్‌ ప్రాజెక్టుపై క్లిక్‌ చేయాలి. విఎస్‌డిసి ఆటోమేటిక్‌ బెస్ట్‌ సైజింగ్‌ను ఎంపిక చేస్తుంది. ఎక్స్‌పోర్ట్‌ ప్రాజెక్టుపై మళ్ళీ క్లిక్‌ చేయాలి. వెంటనే అక్కడ కొత్త వీడియో ఫైల్‌ని క్రియేట్‌ చేస్తుంది. డిఫాల్ట్‌గా ఎడిట్‌ చేసిన ఫుటేజ్‌ వీడియో ఫైల్‌లోకి వచ్చేస్తుంది.




ఎలాంటి సాఫ్ట్‌వేర్‌ వద్దనుకుంటే 


 వెబ్‌బ్రౌజర్‌, ఇంటర్నెట్‌ యాక్సెస్‌ ఉండాలి. 

 www.clideo.com   నుంచి క్రాప్‌ ఫంక్షన్‌పై క్లిక్‌ చేయాలి

చూజ్‌ ఫైల్‌పై క్లిక్‌ చేసి వీడియోను ఎంపిక చేసుకోవాలి. కంప్యూటర్‌/ డ్రాప్‌బాక్స్‌/ గూగుల్‌ డ్రైవ్‌  నుంచి వీడియోను క్లిడియో అప్‌లోడ్‌ చేస్తుంది.

 అనుకున్న షేప్‌లోకి  రీసైజ్‌ చేయాలి. లేదంటే ప్రీసెట్‌ యాస్పెక్ట్‌ రేషియోని ఎంపిక చేసుకోవచ్చు.

 ఎడిటడ్‌ ఫుటేజ్‌  ఎందులో సేవ్‌ చేయాలని అనుకుంటున్నారో సదరు ఫైల్‌ ఫార్మేట్‌ను ఎంపిక చేసుకోవాలి. క్రాప్‌ని క్లిక్‌ చేయాలి.

 ఇదంతా జరిగితే చాలు ఎక్కడ అంటే అక్కడ కంప్యూటర్‌/ డ్రాప్‌బాక్స్‌/ గూగుల్‌ డ్రైవ్‌లో సేవ్‌ చేసుకోవాలి.


Updated Date - 2021-02-06T06:03:57+05:30 IST