Abn logo
Oct 27 2021 @ 16:03PM

Viral Video: హోటల్ బయట ఇద్దరు యువతుల కొట్లాట.. ఓ యువకుడు ఆపుతున్నా ఆగట్లేదు.. అసలు కథేంటో తెలిసి అవాక్కవుతున్న నెటిజన్లు..!

విడిపోయిన ప్రేయసిపై కక్ష పెంచుకుని దాడి చేసే యువకులను చూస్తుంటాం. కానీ ఒకే వ్యక్తి కోసం ఇద్దరు యువతులు కొట్టుకోవడం మాత్రం చాలా అరుదుగా చూస్తుంటాం. గొడవ పడుతున్న వారిని ఆపేందుకు యువకుడు.. ఎంత ప్రయత్నించినా పట్టించుకోలేదు. చివరకు అసలు విషయం తెలిసి అంతా అవాక్కయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే..

రాబిన్ అనే యువకుడు ఇద్దరు యువతులతో కలిసి ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని బరాబిర్వా కూడలికి సమీపంలో ఓ హోటల్ బయట ఉన్నాడు. అంతలోనే ఓ కారు వచ్చి ఆగింది. యువకుడితో పాటూ వచ్చిన ఇద్దరు యువతులు.. కారులోని మహిళతో గొడవపడ్డారు. వారిని విడిపించేందుకు యువకుడు ఎంత ప్రయత్నించినా... వినిపించుకోలేదు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఇద్దరు యువతులతో పాటూ యువకుడిని కూడా అరెస్ట్ చేశారు.

తీరా అసలు విషయం తెలిసి అంతా అవాక్కయ్యారు. కారులో ఉన్న యువతి, రాబిన్‌ గతంలో ప్రేమించుకున్నారు. తర్వాత కొన్నాళ్లకు విడిపోయారు. ఇటీవల రాబిన్.. మరో యువతితో డేటింగ్‌లో ఉన్నాడు. ఈ క్రమంలో హోటల్ వద్ద మాజీ ప్రేయసి తారసపడడంతో ఇద్దరు యువతులకు కోపం కట్టలు తెంచుకుంది. ఒక్కసారిగా ఆమెపై దాడికి దిగారు. రాబిన్ వారిస్తున్నా లెక్కచేయలేదు. తీవ్రంగా గాయపడిన ఆమెను.. స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఇదిలావుండగా, గాయపడిని యువతి అక్టోబరు 10న రాబిన్‌పై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దీంతో ఆమెపై కోపం పెంచుకున్న ఇద్దరు యువతులు.. దాడికి దిగినట్లు సమాచారం.


ఇవి కూడా చదవండిImage Caption

ప్రత్యేకంమరిన్ని...