ఈ పిల్లి సాహ‌సం చూస్తే.. ఔరా అనాల్సిందే!(వైర‌ల్ వీడియో)

ABN , First Publish Date - 2021-05-16T23:09:34+05:30 IST

ఓ పిల్లికి సంబంధించిన వీడియో ఒక‌టి ఇప్పుడు నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంది.

ఈ పిల్లి సాహ‌సం చూస్తే.. ఔరా అనాల్సిందే!(వైర‌ల్ వీడియో)

చికాగో: ఓ పిల్లికి సంబంధించిన వీడియో ఒక‌టి ఇప్పుడు నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజ‌న్లు ఒక్క క్ష‌ణం త‌మ క‌ళ్ల‌ను తాము నమ్మ‌లేక‌పోతున్నారు. ఇంత‌కు వీడియోలో ఏముంద‌నేగా మీ అనుమానం. ఓ పిల్లి ఐదో అంత‌స్తు భ‌వ‌నంపై నుంచి అమాంతం కింద‌కు దూకేయ‌డం. ఆ త‌ర్వాత అలా లేచి వెళ్లిపోవ‌డం వీడియోలో ఉంది. అంత ఎత్తు నుంచి దూకిన పిల్లికి ఏమీ కాక‌పోవ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది. అగ్ని ప్ర‌మాదం సంభ‌వించిన ఆ భ‌వ‌నంలో స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టిన‌ చికాగో అగ్నిమాప‌క సిబ్బంది.. ఈ ఘ‌ట‌న‌ను వీడియో తీసి సోష‌ల్ మీడియాలో పెట్టింది. దాంతో ఈ వీడియో వైర‌ల్‌గా మారింది. ఇప్ప‌టివ‌ర‌కు 1 మిలియ‌న్ వ్యూస్ వ‌చ్చాయి.    



Updated Date - 2021-05-16T23:09:34+05:30 IST