Abn logo
Sep 18 2020 @ 21:30PM

శ్వేతా బచ్చన్‌ని చూపిస్తూ.. జయా బచ్చన్‌పై విమర్శలు

Kaakateeya

బాలీవుడ్‌లో డ్రగ్స్‌ వినియోగం విపరీతంగా ఉందని నటుడు, బీజేపీ ఎంపీ రవి కిషన్‌ పార‍్లమెంటులో వ్యాఖ్యానించ‌డంపై బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ అమితాబ్‌బ‌చ్చ‌న్ భార్య, సమాజ్‌‌వాది పార్టీ ఎంపీ జయాబచ్చన్ ఆగ్ర‌హం వ్య‌క్తంచేసిన విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యలు వింటే అన్నం పెట్టిన చేతినే నరుక్కున్నట్లుగా ఉంద‌ని ఆమె విమ‌ర్శిస్తూ.. బాలీవుడ్‌ని నిందించడాన్ని ఆమె తప్పుపట్టారు. ఆమె పార్లమెంట్‌లో చేసిన ఈ వ్యాఖ్యల అనంతరం ఆమె కుటుంబానికి భద్రత కూడా పెంచారు.


ఇదిలా ఉంటే.. జయాబచ్చన్‌ బాలీవుడ్‌పై ప్రేమను కురిపించి కొన్ని గంటలు కూడా కాకముందే.. ఆమె కూతురు శ్వేతాబచ్చన్‌ అధిక మోతాదులో డ్రింక్‌ చేసి.. ఓ రెస్టారెంట్‌ నుంచి బయటకు వస్తున్నట్లుగా చెబుతూ.. వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవ్వడం విశేషం. ఆమెతో పాటు ఈ వీడియోలో నటాషా నందా, నిర్మాత జోయా అక్తర్‌లు కూడా ఉన్నారు. ప్రస్తుతం ఈ వీడియోని చూపిస్తూ.. సోషల్‌ మీడియాలో జయాబచ్చన్‌పై విమర్శలు చేస్తున్నారు.


Advertisement
Advertisement
Advertisement