Abn logo
Sep 23 2021 @ 17:37PM

VIRAL VIDEO : ఎంపీకి తాను వాడిన మాస్క్ ఇచ్చిన మంత్రిగారు!

ప్రస్తుత కోవిడ్ కాలంలో మాస్క్ తప్పనిసరి. అయితే, మాస్క్ ధరించటం ఎంత ముఖ్యమో... అంతే ముఖ్యం, మాస్క్ శుభ్రత కూడా. సరైన శ్రద్ధ లేకుండా మాస్క్ ధరిస్తే పెద్దగా ఉపయోగం ఏమీ ఉండదు. కొన్నిసార్లు మరింత ప్రమాదకరం కూడా కావచ్చు. ఇప్పుడు ఈ కోణంలోనే చర్చించుకుంటున్నారు నెటిజన్స్. వారి డిస్కషన్ కి కారణం కేంద్ర విమానాయాన శాఖా మంత్రి జ్యోతిరాదిత్య సింధియా. 


మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో జరిగిన ఓ మీటింగ్‌లో, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య, తన మాస్క్ తీసి ఎంపీ అనూప్ మిశ్రాకి ఇచ్చారు. ఆయన రెండు మాస్క్‌లు ధరిస్తూ ఉండటంతో ఎంపీకి ఒకటి అందించారు. అయితే, జ్యోతిరాదిత్య సింధియా తాను వాడిన మాస్క్ ఇవ్వటంపై సొషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అలా చేయటం తప్పని కొందరు అంటున్నారు. ఎంపీకి మినిస్టర్ తన ముఖంపై నుంచీ మాస్క్ తీసి ఇస్తోన్న వీడియో ప్రస్తుతం నెట్‌లో వైరల్ అవుతోంది.

  


ఇవి కూడా చదవండిImage Caption