చెన్నై: పిల్లిని ఉరితీసి, ఆ వీడియో టిక్‌టాక్‌లో పోస్టు చేసిన ఓ యువకుడిని తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు. తిరునల్వేలి జిల్లా సెట్టికుళానికి చెందిన తంగదురై పశువుల ఫాంలో పని చేస్తున్నాడు. వినూత్నంగా వీడియో పోస్టు చేసి టిక్‌టాక్‌లో అధిక లైక్‌లు పాందాలనుకున్నాడు. తన పెంపుడు పిల్లిని ఉరితీస్తూ వీడియోను తీసి టిక్‌టాక్‌లో పోస్టు చేశాడు. దీనిపై తిరునల్వేలి జంతువధ నిరోధక, భద్రతా సంస్థ నిర్వాహకులు పళవూర్ ఫిర్యాదు మేరకు పోలీసులు తంగదురైను అరెస్టు చేశారు.