Advertisement
Advertisement
Abn logo
Advertisement

విద్యుత్‌ సవరణ బిల్లు రద్దుచేయాలి

 కౌలు రైతు సంఘ నాయకుడు రంగారావు 

కంకిపాడు, నవంబరు 26 : మూడు వ్యవసాయ చట్టాలనే కాకుం డా విద్యుత్‌ సవరణ బిల్లు 2020ను రద్దుచేయాలని కౌలు రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు పంచకర్ల రంగారావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. విద్యుత్‌ సవరణ బిల్లును రద్దు చేయాలని కోరుతూ కంకిపాడు సెంటర్‌లో శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సంద ర్భంగా రంగారావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనాలోచిత నిర్ణయా ల వల్ల దేశ వ్యాప్తంగా రైతులు అనేక ఇబ్బందులు పడ్డార న్నారు. పలువురు రైతులు మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు.  వ్యవ సాయ చట్టాలతో విద్యుత్‌ సవరణ బిల్లు, కనీస మద్దతు ధర, రైతులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్ర మంలో పోతురాజు నాగేశ్వరరావు, బోట్ల సాంబశివరెడ్డి, సీహెచ్‌ వీ రెడ్డియ్య, ఎం.రజని, టి.నరేష్‌, ఏ.ఉషారాణి, జి.కుమారి, వి.జాన్‌ మోజస్‌, శ్రీ హరి తదితరులు పాల్గొన్నారు.

పెనమలూరు సెంటర్‌లో..

 పెనమలూరు  : రైతులకు ఉపయోగపడే చట్టాలను చట్టబద్ధం చేయాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. ఢిల్లీలో రైతు లు చేస్తున్న పోరాటం శుక్రవారంతో ఏడాది పూర్తయిన సందర్భంగా వారికి సంఘీభావంగా పెనమలూరు సెంటర్‌లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు గుజ్జల ఈశ్వరయ్య మాట్లాడుతూ పార్లమెంటులో చేసిన చట్టాన్ని పార్టమెంటులోనే రద్దు చేయాలన్నారు. కౌలు రైతు సంఘం జిల్లా నాయకుడు పంచకర్ల రంగారావు మాట్లాడుతూ ఢిల్లీలో రైతుల మీద పెట్టిన కేసులు ఎత్తివేసి, రైతుకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు నార్ల వెంకటేశ్వరరావు, ఉప్పాడ త్రిమూర్తులు, తాడంకి సురేష్‌, గొల్ల సాయి కుమార్‌, కొక్కిలిగడ్డ శ్యాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement