Abn logo
May 16 2021 @ 00:31AM

వాస్తవ కథతో విద్యాబాలన్‌ చిత్రం

విభిన్న కథా చిత్రాల్లో విలక్షణ పాత్ర లు పోషిస్తూ నటిగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు బాలీవుడ్‌ కథానాయిక విద్యాబాలన్‌. ప్రస్తుతం ఆమె ‘షేర్ని’  చిత్రంలో అటవీ అధికారిణిగా నటిస్తున్నారు. తాజాగా ఆమె మరో చిత్రంలో నటించేందుకు అంగీకరించారని బాలీవుడ్‌ సమాచారం. గతంలో విద్యాబాలన్‌తో ‘తుమ్హారీ సులూ’, ప్రస్తుతం తాప్సీ ప్రధాన పాత్రలో ‘లూప్‌లపేటా’ చిత్రాన్ని నిర్మిస్తున్న తనూజ్‌ గార్గ్‌, అతుల్‌ కాస్బేగర్‌ వాస్తవిక కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. కొంతకాలంగా విద్యాబాలన్‌తో ఈ సినిమా కథ గురించి వారు చర్చిస్తున్నారు. స్ర్కిప్ట్‌ విద్యాబాలన్‌కు నచ్చటంతో ఈ చిత్రంలో నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారట. భావోద్వేగాలు, మానవ సంబంధాలు ప్రధానాశంగా సాగే కథలో బలమైన వ్యక్తిత్వం ఉన్న మహిళగా విద్యాబాలన్‌ కనిపించనున్నారు. ముంబైతో పాటు దక్షిణాదిలో 45 రోజుల పాటు జరిగే షెడ్యూల్‌లో ఈ చిత్రాన్ని పూర్తి చేయనున్నారు.