విద్యా దీవెన ద్వారా 99,441 మందికి లబ్ధి

ABN , First Publish Date - 2021-07-30T06:11:09+05:30 IST

జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా జిల్లాలో 99,441 మంది విద్యార్థులకు ఈ ఏడాది లబ్ధి జరిగినట్లు రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత తెలిపారు.

విద్యా దీవెన ద్వారా 99,441 మందికి లబ్ధి
విద్యా దీవెన రెండో విడత చెల్లింపులు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు సుచరిత, వనిత

గుంటూరు, జూలై 29 (ఆంధ్రజ్యోతి): జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా జిల్లాలో 99,441 మంది విద్యార్థులకు ఈ ఏడాది లబ్ధి జరిగినట్లు రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. గురువారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్‌ విద్యా దీవెన రెండో విడత చెల్లింపులను మీట నొక్కి విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌ నుంచి మంత్రులు, అధికారులు హాజరయ్యారు. జిల్లాలో ఆయా విద్యార్థుల తల్లులు 88,495 మందికి బ్యాంకు ఖాతాల్లో రూ.73.52 కోట్లు జమ చేసినట్లు సుచరిత తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి తానేటి వనిత, రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ రెగ్యులేటరీ మానిటరింగ్‌ కమిషన్‌ వైస్‌చైర్‌పర్సన్‌ డాక్టర్‌ విజయశారదరెడ్డి, టూరిజం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ చైర్మన్‌ అరిమండ వరప్రసాద్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మహమ్మద్‌ ముస్తఫా, మద్ధాళి గిరిధర్‌, కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌, నగర మేయర్‌ కావటి శివనాగ మనోహర్‌నాయుడు, జేసీ శ్రీధర్‌రెడ్డి, ఏఎన్‌యూ వీసీ పీ రాజశేఖర్‌, రెక్టార్‌ వరప్రసాద్‌ మూర్తి, రిజిస్ట్రార్‌ కే రోశయ్య, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ మధుసూదన్‌, బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్‌ కల్పనబేబి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ పీడీ మనోరజంని పాల్గొన్నారు. 


Updated Date - 2021-07-30T06:11:09+05:30 IST