Polavaram ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తవుతుందో కేంద్రమే చెప్పాలి: వడ్డే శోభనాద్రీశ్వరరావు

ABN , First Publish Date - 2022-05-21T20:24:36+05:30 IST

సీపీఐ నేత కొల్లి నాగేశ్వరరావు ద్వితీయ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన పుస్కకావిష్కరణ సదస్సులో పలువురు ప్రముఖులు, రైతు, కార్మిక,అఖిల పక్షాల నాయకులు

Polavaram ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తవుతుందో కేంద్రమే చెప్పాలి: వడ్డే శోభనాద్రీశ్వరరావు

విజయవాడ: సీపీఐ నేత కొల్లి నాగేశ్వరరావు ద్వితీయ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన పుస్కకావిష్కరణ సదస్సులో పలువురు ప్రముఖులు, రైతు, కార్మిక,అఖిల పక్షాల నాయకులు మాట్లాడారు. ‘పోలవరం ఎన్నటికి సాకారమయ్యెను’ పుస్తక రచయిత టి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ అన్ని అనుమతులు పొందిన జాతీయ బహుళార్ధ ప్రాజెక్ట్ పోలవరం‌పై నెలకొన్న అనిశ్చితికి కారణాలు,ఇతర అంశాలను పుస్తకంలో ప్రస్తావించానన్నారు. ప్రాజెక్టు పూర్తయితే విశాఖకు తాగునీరు, కర్మాగారాలకు, వ్యవసాయ అవసరాలకు నీరు ఇవ్వొచ్చన్నారు. మోడీ ప్రభుత్వం బడ్జెట్‌లో అరకొర నిధులు కేటాయిస్తే.. ప్రాజెక్ట్ పూర్తి కావడం ఆలస్యమవుతుందన్నారు. జగన్ ప్రభుత్వం పోలవరం ఎత్తులో 41.1 మీటరు ఎత్తు వరకే నీటిని నిలబెడతామంటున్నారని..ఫలితంగా ప్రాజెక్ట్‌తో వచ్చే ప్రయోజనాలన్నీనిరూపయోగ మేనన్నారు. పుస్తక ఆవిష్కర్త వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ ప్రాజెక్ట్ ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేని పరిస్థితుల్లో కేంద్ర జలవనరుల శాఖ ఉందన్నారు. పెరుగుతున్న ప్రాజెక్ట్ అంచనాలను కేంద్రమే భరించాలన్నారు. కేంద్రం జాతీయ రహదారుల కోసం కోట్లు ఖర్చు చేస్తోంది కానీ వ్యవసాయానికి నిధులు మాత్రం నామమాత్రంగా ఇస్తున్నారని విమర్శించారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు  మాట్లాడుతూ దేశాన్ని తీవ్ర ఆర్ధిక సంక్షోభం దిశగా మోడీ ప్రభుత్వం తీసుకువెళ్తుందన్నారు. రాష్ట్రంలో ఆ స్థితి మరింత ఆందోళనకరంగా ఉందన్నారు. అనంతరం దాసరి బలవర్ధన్ రావు మాట్లాడారు.

 

Updated Date - 2022-05-21T20:24:36+05:30 IST