విజ్ఞాన్‌ వర్సిటీలో ఆన్‌లైన్‌ కోర్సులుప్రారంభించిన విద్యాశాఖ మంత్రి సురేష్‌

ABN , First Publish Date - 2022-01-21T18:22:35+05:30 IST

గుంటూరు జిల్లా వడ్లమూడిలోని విజ్ఞాన్‌ విశ్వవిద్యాలయంలో ఆన్‌లైన్‌ లాచింగ్‌ ప్రోగ్రామ్‌ను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌, ఉన్నతవిద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ హేమచంద్రారెడ్డి తదితరులు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.

విజ్ఞాన్‌ వర్సిటీలో ఆన్‌లైన్‌ కోర్సులుప్రారంభించిన విద్యాశాఖ మంత్రి సురేష్‌

గుంటూరు (విద్య), జనవరి 20: గుంటూరు జిల్లా వడ్లమూడిలోని విజ్ఞాన్‌ విశ్వవిద్యాలయంలో ఆన్‌లైన్‌ లాచింగ్‌ ప్రోగ్రామ్‌ను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌, ఉన్నతవిద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ హేమచంద్రారెడ్డి తదితరులు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. విద్యార్థులకు అందుబాటులో ఉండేలా ఆన్‌లైన్‌ లెర్నింగ్‌ విభాగంలో బీబీఏ(జనరల్‌), ఎంబీఏ(హెచ్‌ఆర్‌), ఎంబీఏ(ఫైనాన్స్‌), ఎంబీఏ(జనరల్‌) తదితర కోర్సులు ప్రవేశపెట్టడం హర్షణీయమని పేర్కొన్నారు.  ప్రొఫెసర్‌ హేమచంద్రారెడ్డి మాట్లాడుతూ.. విజ్ఞాన్‌ వర్సిటీకి ఈ కోర్సులు మరో మైలురాయి లాంటివని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ వివేక్‌ యాదవ్‌, విజ్ఞాన్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వైస్‌ చైర్మన్‌, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పాల్గొన్నారు. ఆన్‌లైన్‌ కోర్సులు, వివరాలను ఠీఠీఠీఠీ.ఠిజీజుఽ్చుఽౌుఽజూజీుఽ్ఛ.ఛిౌఝ వెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకోవచ్చనని ఇన్‌చార్జ్‌ వీసీ డాక్టర్‌ కేవీ కృష్ణకిషోర్‌ వెల్లడించారు.

Updated Date - 2022-01-21T18:22:35+05:30 IST