మొక్కలు పెంచి ఆక్సిజన్‌ అందిద్దాం

ABN , First Publish Date - 2021-07-30T06:12:59+05:30 IST

మొక్కలు పెంచి సమాజానికి ఆక్సిజన్‌ అందించే కత్రువులో విద్యార్థులు భాగస్వాములు కావాలని విజ్ఞాన్‌ వీసీ డాక్టర్‌ ఎంవైఎస్‌ ప్రసాద్‌ తెలిపారు.

మొక్కలు పెంచి ఆక్సిజన్‌ అందిద్దాం
మొక్కలు నాటుతున్న విద్యార్థులు, చిత్రంలో డాక్టర్‌ లావు రత్తయ్య, వీసీ ఎంవైఎస్‌ ప్రసాద్‌ తదితరులు

విజ్ఞాన్‌ వీసీ డాక్టర్‌ ఎంవైఎస్‌ ప్రసాద్‌

గుంటూరు(విద్య), జూలై 29: మొక్కలు పెంచి సమాజానికి ఆక్సిజన్‌ అందించే కత్రువులో విద్యార్థులు భాగస్వాములు కావాలని విజ్ఞాన్‌ వీసీ డాక్టర్‌ ఎంవైఎస్‌ ప్రసాద్‌ తెలిపారు. గురువారం వర్సిటీ ప్రాంగణంలో  అగ్రికల్చరల్‌ విద్యార్థులు 2500 మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కలు నాటడం ఎంతముఖ్యమో వాటిని సంరక్షించడం కూడా అంతేముఖ్యమని చెప్పారు. విజ్ఞాన్‌ చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ ప్రకృతి సంరక్షణలో విద్యార్థుల పాత్ర ఎంతో ఉందన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ ఎంఎస్‌ రఘునాథన్‌, అగ్రికల్చరల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ టీ రమేష్‌బాబు, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ వరప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-30T06:12:59+05:30 IST