వైదిక వ్యవసాయంపై చర్చ.. అందరూ ఆహ్వానితులే

ABN , First Publish Date - 2020-10-17T18:00:35+05:30 IST

నగరంలోని రామకృష్ణ మఠానికి చెందిన ‘వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్’ ఆధ్వర్యంలో ‘వైదిక వ్యవసాయం’పై చర్చా కార్యక్రమం జరగనుంది.

వైదిక వ్యవసాయంపై చర్చ.. అందరూ ఆహ్వానితులే

హైదరాబాద్: నగరంలోని రామకృష్ణ మఠానికి చెందిన ‘వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్’ ఆధ్వర్యంలో ‘వైదిక వ్యవసాయం’పై చర్చా కార్యక్రమం జరగనుంది. వీఐహెచ్ఈ డైరెక్టర్ స్వామి బోధమయానంద గారి నేతృత్వంలో జరగనున్న ఈ కార్యక్రమంలో కృషి భారతం ట్రస్ట్ వ్యవస్థాపకులు కౌటిల్య కృష్ణన్, వీఐహెచ్ఈ అధ్యాపకులు బాలాజీ సుకుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొననున్నారు. ఈ నెల 18న ఆదివారం రోజున ఉదయం 11 గంటలకు చర్చ జరగనుంది. జూమ్ యాప్ ద్వారా చర్చావేదికను పంచుకోవచ్చని వీఐహెచ్ఈ తెలిపింది. 



Updated Date - 2020-10-17T18:00:35+05:30 IST