Abn logo
Nov 26 2020 @ 17:43PM

అన్న వస్త్ర వ్యాపారం‌.. తమ్ముడేమో..??

రౌడీ హీరో విజయ్ దేవరకొండ పాన్‌ ఇండియా ఇమేజ్‌తో ఇప్పుడు స్టార్‌ హీరోగా మారిపోయిన విషయం తెలిసిందే. హీరోగానే కాకుండా వ్యాపారంలోనూ తన అభిరుచి చాటుతున్నాడు విజయ్‌. రౌడీ వేర్ ఫ్యాషన్ బ్రాండ్లతో పాటు ఇటీవల ఎలక్ట్రిక్ వెహికిల్ కంపెనీలో ఆయన భాగస్వామి అయ్యారు. ఇప్పుడు అన్న చూపిన బాటలోనే తమ్ముడు ఆనంద్ దేవరకొండ (దొరసాని, మిడిల్‌ క్లాస్‌ మెలోడీస్‌ చిత్రాల హీరో) కూడా పయనిస్తున్నాడు. ఆనంద్ దేవరకొండ తన స్నేహితులు నిర్వహిస్తున్న "గుడ్ వైబ్స్ ఓన్లీ" కేఫ్ లో పార్టనర్ అయ్యారు. హైదరాబాద్ ఖాజాగూడలో ఈ కేఫ్ ఫుడ్ లవర్స్ ను ఆకర్షిస్తోంది. ఈ విషయాన్ని ఆనంద్ దేవరకొండ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఈ వీకెండ్ గుడ్ వైబ్స్ ఓన్లీ కేఫ్ కు వచ్చిన కస్టమర్ల సగం బిల్ తాను పే చేస్తానని విజయ్ దేవరకొండ అనౌన్స్ చేశారు.


"నేను, మా అన్నయ్య విజయ్ ఇద్దరం ఫుడ్ బేస్డ్ మూవీస్‌తోనే మంచి సక్సెస్ అందుకున్నాం. "మిడిల్ క్లాస్ మెలొడీస్" ద్వారా వచ్చిన నా రెమ్యునరేషన్ ను ఈ ఫుడ్ బిజినెస్ లోనే ఇన్వెస్ట్ చేస్తున్నాను. మా స్నేహితులు కలిసి నిర్వహిస్తున్న 'గుడ్ వైబ్స్ ఓన్లీ' కేఫ్ లో భాగస్వామి అవడం సంతోషంగా ఉంది. మీ ప్రేమ వల్లే మా కలలను నెరవేర్చుకోగలుగుతున్నాం." అని ఆనంద్ దేవరకొండ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.


ఇక రౌడీ హీరో విజయ్ దేవరకొండ స్పందిస్తూ... "మిడిల్ క్లాస్ మెలొడీస్" సినిమా హిట్ అయిన సంతోషంలో ఉన్నాను. నేను నా ఆనందాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నా. అందుకే ఈ వీకెండ్ "గుడ్ వైబ్స్ ఓన్లీ" కేఫ్ కు వచ్చే మీ కోసం సగం బిల్ నేను చెల్లిస్తాను. సో మీ అందరికీ వెల్ కమ్. బిల్ నాది" అని ట్వీట్ చేశారు.



Advertisement
Advertisement
Advertisement