Jul 13 2021 @ 15:55PM

Vijay devarakonda: గోవా బీచ్‌లో విజయ్‌-కియారా!

విజయ్‌ దేవరకొండకు ఫ్యాన్స్‌లో ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జయాపజయాలతో సంబంధం లేకుండా అభిమానుల ప్రేమను సొంతం చేసుకున్నాడాయన. టాలీవుడ్‌లోనే కాదు బాలీవుడ్‌లోనూ అభిమానులు, ఫాలోయర్లు ఉన్నారు. సారా అలీఖాన్‌, జాన్వీ కపూర్‌, శ్రద్ధా కపూర్‌ విజయ్‌ తమ అభిమాన హీరో అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. తమన్నా అయితే ఓ అడుగు ముందుకేసి ‘విజయ్‌కి ముద్దు పెడతా’ అని చెప్పారు. తాజాగా ఈ లిస్ట్‌లో కియారా అడ్వాణీ కూడా చేరినట్లు తాజా పరిస్థితులు చూస్తుంటే అర్థమవుతోంది. వీరిద్దరూ కలిసి ఏ సినిమాలోనూ నటించలేదు కానీ..  ఓ వాణిజ్య ప్రకటనలో నటించారు. ఆ చనువుతో ఇద్దరూ గోవా ట్రిప్‌ వేశారనే వార్త ఫిల్మ్‌నగర్‌లో చక్కర్లు కొడుతోంది. గోవా బీచ్‌లో విజయ్‌-కియారా దిగిన ఫొటో ఒకటి నెట్టింట వైరల్‌ కావడమే ఇందుకు కారణం. అయితే వీరిద్దరూ ఈ ట్రిప్‌ ఎప్పుడు వేశారన్నది తెలియాల్సి ఉంది. విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో ‘లైగర్‌’ సినిమాలో నటిస్తున్నారు. ప్యాన్‌ ఇండియా స్థాయిలో ఈ చిత్రం విడుదల కానుంది.