Abn logo
Nov 22 2020 @ 19:37PM

తన తమ్ముడి సినిమా సూపరంటోన్న రౌడీ హీరో

Kaakateeya

రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ సోదరుడు ఆనంద్‌ దేవరకొండ హీరోగా, 'బిగిల్‌' వంటి చిత్రంలో ఓ కీలక పాత్రలో నటించిన వర్షా బొల్లమ్మ హీరోయిన్‌గా నూతన దర్శకుడు వినోద్‌ అనంతోజు దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం 'మిడిల్‌ క్లాస్‌ మెలోడీస్‌'. ఈ చిత్రం  నవంబర్‌ 20న ఓటీటీలో అగ్రగామిగా దూసుకుపోతోన్న అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ద్వారా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ప్రేక్షకుల నుంచి మంచి స్పందననే రాబట్టుకుంటున్న ఈ చిత్రం గురించి రౌడీ హీరో స్పెషల్‌ గా ఓ ట్వీట్ చేశారు. ఈ సినిమా తనకు సూపర్బ్‌గా నచ్చిందని చెబుతూనే.. సినిమా క్యాస్ట్ అండ్‌ క్రూ గురించి గొప్పగా చెబుతూ.. ఓ లెటర్‌ని విడుదల చేశారు. 


ఇందులో దర్శకుడు వినోద్‌ అనంతోజు, హీరోయిన్‌ వర్షా బొల్లమ్మ, ఆనంద్‌ తండ్రిగా చేసిన కొండలరావు, గోపాల్‌, చైతన్య, తరుణ్‌ భాస్కర్‌.. ఇలా అందరి గురించి చెబుతూ.. వారందరి వర్క్‌ని మెచ్చుకున్న విజయ్‌.. చివరిగా తన తమ్ముడు ఆనంద్‌ దేవరకొండ చిత్రాలు ఎన్నుకుంటున్న విధానానికి హ్యాట్సాఫ్‌ చెప్పారు. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్న ఆనంద్‌ని చూస్తుంటే ఎంతో గర్వంగా ఉందని.. ఇలాగే ఎన్నో మంచి మంచి స్టోరీలు, దర్శకులు, నటీనటులతో అతని ప్రయాణం సాగాలని కోరారు. ఫైనల్‌గా ఒక్కటే చెబుతున్నానని చెబుతూ సినిమాలో ఆనంద్‌ తండ్రి చెప్పే.. 'కష్టపడు.. ఏదైనా అవసరం వస్తే కాల్‌ చెయ్యి..' అని.. తన తమ్ముడికి తన సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని విజయ్‌ తెలిపారు. 


Advertisement
Advertisement