Abn logo
Oct 18 2020 @ 21:53PM

హైదరాబాద్‌ వరదలపై రౌడీ హీరో ట్వీట్‌

Kaakateeya

రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ ఈ మధ్య బాగా వార్తల్లో నిలుస్తున్నాడు. రీసెంట్‌గా ఆయన ఓటు హక్కుపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే. ఓటు హక్కుపై విజయ్‌ చేసిన కామెంట్స్‌ను కొందరు ఏకీభవిస్తే.. మరి కొందరు విమర్శించిన వారూ ఉన్నారు. తాజాగా విజయ్‌ దేవరకొండ హైదరాబాద్‌లో కురుస్తోన్న వర్షాలపై, తద్వారా భీభత్సం సృష్టిస్తున్న వరదలపై ట్వీట్ చేశారు. కొన్ని రోజులుగా హైదరాబాద్‌లో వర్ష భీభత్సం ఎలా ఉందో తెలియంది కాదు. హైదరాబాద్‌లోని కొన్ని ఏరియాల వాసులు వరదల కారణంగా ఎంతగానో ఇబ్బంది పడుతున్నారు. దీనిపై విజయ్‌ దేవరకొండ ట్వీట్‌ చేశారు. 

''హైదరాబాద్‌.. ఇలాంటి సమయంలో నేను అందుబాటులో లేనందుకు చాలా బాధగా ఉంది. మీ అందరి కోసమే నేను ఆలోచిస్తున్నా.. అందరి కోసం ప్రార్థనలు చేస్తున్నా.. తొందరగా అక్కడికి రావాలని ప్రయత్నం చేస్తున్నాను.." అని విజయ్‌ దేవరకొండ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. దీనికి నెటిజన్లు.. మేము కూడా నిన్ను మిస్‌ అవుతున్నాం..అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


Advertisement
Advertisement
Advertisement