Abn logo
May 31 2020 @ 12:52PM

విజ‌య్ ‘మాస్టర్‌’ టీజర్ డేట్‌

విజయ్‌ హీరోగా లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో నటించిన ‘మాస్టర్‌’ చిత్రం విడుదలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఈ చిత్రం గత ఏప్రిల్‌ 9న విడుదల కావాల్సి ఉండగా,  లాక్‌డౌన్‌ కారణంగా  జాప్యం జరిగింది. దీంతో విజయ్‌ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులకు ప్రభుత్వం అనుమతించింది. అయితే, షూటింగులకు సంబంధించిన అనుమతులు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. దీంతో, షూటింగ్‌ పూర్తిచేసుకున్న చిత్రాల విడుదలపై నిర్మాతలు ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘మాస్టర్‌’ చిత్రాన్ని విజయ్‌ పుట్టినరోజైన జూన్‌ 22న విడుదల చేయాలని భావించినా, థియేటర్లు ఎప్పుడు ప్రారంభమవు తాయనే విషయంపై స్పష్టత లేకపోయింది.ఈ నేపథ్యంలో ఈ చిత్ర విడుదలపై తాజా సమాచారం ప్రకారం దీపావళి పండుగకు ‘మాస్టర్‌’ చిత్రాన్ని విడుదల చేయాలని,అంతకు ముందు జూన్‌ 22న విజయ్‌ పుట్టినరోజు సందర్భంగా చిత్ర టీజర్‌ను విడుదల చేయాలని చిత్ర యూనిట్‌ నిర్ణయించినట్టు సమాచారం.

Advertisement
Advertisement
Advertisement