Jun 14 2021 @ 12:42PM

ఆ విష‌యంలో టాప్‌గా ‘మాస్టర్‌’

సినీ ప్రేక్షకులు 2021లో అత్యధికంగా చూసిన చిత్రాలు, వెబ్ సిరీస్‌ల‌ వివరాలను ఐఎండీబీ ప్రత్యేకంగా విడుదల చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ జాబితాలో ద‌ళపతి విజయ్‌ నటించిన ‘మాస్టర్‌’ చిత్రం అగ్రస్థానంలో నిలిపిచింది. ఈ చిత్రం థియేటర్లలో 200 కోట్ల రూపాయల కలెక్షన్లను రాబట్టింది. అదేవిధంగా అమెజాన్‌లో కూడా విడుదలై అతిపెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. అక్కడ కూడా మొదటి స్థానంలోనే నిలిచింది. ఆ తర్వాత పలు వెబ్‌సిరీ్‌సలు రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఇకపోతే, జిత్తు-జోసెఫ్‌ దర్శకత్వంలో మోహన్‌లాల్‌ - మీనా నటించిన ‘దృశ్యం-2’ చిత్రం ఓటీటీలో విడుదలై రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత హీరోయిన్‌ తమన్నా నటించిన ‘నవంబర్‌ స్టోరీస్‌’ అనే వెబ్‌ సిరీస్‌ ఐదో స్థానంలో నిలువగా, ఆ తర్వాత మారి సెల్వరాజ్‌-హీరో ధనుష్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘కర్ణన్‌’ చిత్రం ఆరో స్థానంలో నిలిచింది. ఏప్రిల్‌ 9వ తేదీన విడుదలైన ఈ చిత్రం 50 శాతం సీటింగ్‌ కెపాసిటీతో థియేటర్లలో ప్రదర్శితమై సూపర్‌ హిట్‌ టాక్‌తో మంచి కలెక్షన్లను రాబట్టింది. అదేవిధంగా ఐడీబీఎం విడుదల చేసిన జాబితాలో మరికొన్ని తమిళ, తెలుగు చిత్రాలు ఉన్నాయి.