Abn logo
Jan 17 2021 @ 13:43PM

రౌడీ కూడా వచ్చేస్తున్నాడు!

విజయ్ దేవరకొండ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఓ భారీ పాన్ ఇండియా చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్‌కి చెందిన ధర్మ ప్రొడక్షన్స్, పూరీ కనెక్ట్స్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు టైటిల్ ఇంకా అధికారికంగా ఖరారు కాలేదు. `ఫైటర్` అనేది వర్కింగ్ టైటిల్. 


ఈ సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్‌ను సోమవారం ఉదయం 10.08 గంటలకు విడుదల చేయబోతున్నట్టు నిర్మాణ సంస్థలు సోషల్ మీడియా ద్వారా వెల్లడించాయి. `భాషలకు అతీతంగా అందరినీ అలరించేందుకు సినిమా సిద్ధమవుతోంది. రేపు ఉదయం 10.08 గంటలకు టైటిల్, ఫస్ట్‌లుక్ విడుదల చేస్తామ`ని పూరీ కనెక్ట్స్ సంస్థ పేర్కొంది. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం పలు భాషల్లో విడుదల కాబోతోంది.


Advertisement
Advertisement
Advertisement