‘800’ నుంచి తప్పుకో!

ABN , First Publish Date - 2020-10-20T09:10:31+05:30 IST

శ్రీలంక స్పిన్‌ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్‌ జీవిత కథ ఆధారంగా తెరకెక్కనున్న బయోపిక్‌ ‘800’ వివాదాస్పదమైంది.

‘800’ నుంచి తప్పుకో!

మురళీధరన్‌ విజ్ఞప్తి.. సరేనన్న సేతుపతి


చెన్నై: శ్రీలంక స్పిన్‌ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్‌ జీవిత కథ ఆధారంగా తెరకెక్కనున్న బయోపిక్‌ ‘800’ వివాదాస్పదమైంది. దీంతో ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించనున్న తమిళ నటుడు విజయ్‌ సేతుపతి.. ప్రాజెక్టు నుంచి తప్పుకొన్నాడు. మురళీ పాత్రలో సేతుపతి నటించడంపై కొన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.


తమిళ రాజకీయ పార్టీలతోపాటు దర్శకుడు భారతీరాజా కూడా నిరసన వ్యక్తం చేశారు. లంక తమిళులను మురళీధరన్‌ వంచించాడని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవాలంటూ సేతుపతికి స్వయంగా ముత్తయ్య విజ్ఞప్తి చేశాడు. ‘నా కారణంగా ఓ అద్భుతమైన నటుడికి ఇబ్బందులు ఎదురవడం సహించలేను. భవిష్యత్‌లో సమస్యలు ఎదురుకాకూడదనే ఉద్దేశంతోనే బయోపిక్‌ నుంచి తప్పుకోవాలని కోరా’ అని మురళీ తెలిపాడు. మురళీ విన్నపానికి అంగీకరిస్తూ సేతుపతి కూడా ఈ ప్రాజెక్టు నుంచి వైదొలగుతున్నట్టు వెల్లడించాడు.

Updated Date - 2020-10-20T09:10:31+05:30 IST