Sep 23 2021 @ 16:27PM

విజయ్ సేతుపతి, క్రికెటర్ శ్రీశాంత్ కలయికలో చిత్రం?

ప్రస్తుతం క్రికెటర్ శ్రీశాంత్ ఇండియన్ టీమ్ లోకి తిరిగి జాయిన్ అవడానికి తన శాయ శక్తులా ప్రయత్నిస్తున్నాడు. ప్రస్తుతం ఐపియల్ సీజన్ జరుగుతుండడంతో .. తన ఫోకస్ ను సినిమాల వైపుకు షిఫ్ట్ చేశాడు. శ్రీశాంత్ గతంలో ‘టీమ్ 5’ అనే మలయాళ చిత్రంతో తన సినీ కెరీర్ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా నిరాశపరిచినప్పటికీ.. సినిమాల మీద అతడి వ్యామోహం ఇంకా తగ్గలేదు. ఇదిలా ఉంటే.. ఇటీవల తన ఇన్ స్టా గ్రామ్ పేజ్ లో విజయ్ సేతుపతితో దిగిన ఓ ఫోటోను షేర్ చేశాడు. త్వరలో అతడితో శ్రీశాంత్ ఓ సినిమా చేయబోతున్నట్టు తెలుస్తోంది. భారీ బడ్జెట్ లో ఈ సినిమా తెరకెక్కుతున్నట్టు సమాచారం.

శ్రీశాంత్ తన ఇన్ స్టా ఖాతాలో విజయ్ సేతుపతితో దిగిన ఫోటోను షేర్ చేయడంతో పాటు..  ‘థాంక్స్ అన్నా.. నీ గురించి తెలుసుకోడాన్ని, ప్రతీ విషయాన్ని నిన్ను చూసి నేర్చుకోవడాన్ని నేను చాలా గౌరవంగా భావిస్తాను. లాట్స్ ఆఫ్ లవ్ అండ్ రెస్పెక్ట్ టు యూ.. అని విజయ్ సేతు మీద తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో త్వరలో ఓ భారీ ప్రాజెక్ట్ మొదలు కానుందని కోలీవుడ్ సమాచారం. మరి ఈ సినిమాతో శ్రీశాంత్ నటుడిగా బిజీ అవుతాడేమో చూడాలి. మరి నిజంగానే విజయ్ సేతుపతితో శ్రీశాంత్ సినిమా చేస్తాడేమో చూడాలి.