Jul 14 2021 @ 09:26AM

మరో టాలీవుడ్‌ డైరెక్టర్‌తో విజయ్‌సేతుపతి?

సినిమాలకు, నటులకు భాషా పరమైన హద్దులు ఎప్పుడూ ఉండవు. డిజిటల్‌ మీడియా ప్రాభవం ఎక్కువ అవుతున్న కొద్ది పరభాషా నటులు, సాంకేతిక నిపుణులు ఇతర భాషల్లో నటించడానికి ఆసక్తి చూపుతున్నారు. అలా టాలీవుడ్‌లో నటించడానికి ఆసక్తి చూపుతున్న వారిలో విజయ్‌ సేతుపతి ఒకడు. ఈయన తెలుగులో ఇప్పటి వరకు ఉప్పెన, సైరా నరసింహారెడ్డి సినిమాల్లో నటించాడు. అలాగే ఆయన నటించిన తమిళ చిత్రాలన్నీ తెలుగులోకి అనువాదమవుతున్నాయి. అలా విజయ్‌ సేతుపతి ఇప్పుడు టాలీవుడ్‌ ప్రేక్షకులకు సుపరిచితుడే. పాన్‌ ఇండియా మూవీ 'పుష్ప'లోనూ విజయ్‌ సేతుపతి నటించాల్సింది. కానీ డేట్స్‌ అడ్జస్ట్‌ కాలేదు. ఇప్పుడు మరో తెలుగు సినిమా దర్శకుడు విజయ్‌ సేతుపతిని తన సినిమాలో నటించమని సంప్రదించాడు. కథను వినిపించాడు. విజయ్‌ సేతుపతికి కథ నచ్చింది. 


అయితే ఇప్పటికే చాలా తమిళ సినిమాలను కమిట్‌ అయ్యి ఉన్నాడు. డేట్స్‌ అడ్జస్ట్‌ అయితే తప్పకుండా నటిస్తానని సదరు డైరెక్టర్‌తో విజయ్‌ సేతుపతి అన్నాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అంతా ఓకే అయితే ఈ తెలుగు దర్శకుడు సినిమాను తెలుగు, తమిళ భాషల్లో రూపొందించేలా ప్లాన్‌ చేసుకున్నాడు. ఇంతకీ దర్శకుడెవరో తెలుసా? డైరెక్టర్‌ రమేశ్‌ వర్మ. క్రైమ్‌ థ్రిల్లర్‌ రాక్షసుడుని తెరకెక్కించిన ఈయన దానికి సీక్వెల్‌గా 'రాక్షసుడు2' చేయబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. మరి రమేశ్‌ వర్మకు విజయ్‌ సేతుపతి ఓకే చెబుతాడా? మరో స్ట్రయిట్‌ తెలుగు సినిమాలో నటిస్తాడా? అనేది తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే మరి.