వైవిధ్యమైన పాత్రలను పోషించడం నటుడిగా దక్షిణాదిన తనదైన గుర్తింపు సంపాదించుకున్నాడు వెర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి ఇప్పుడు బాలీవుడ్‌లోనూ నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇంత క్రేజ్ ఉన్న విజయ్ సేతుపతి టాలీవుడ్‌లోని ఓ చిన్న సినిమాకు పెద్ద మనసుతో సపోర్ట్ చేస్తుండటం విశేషం. ఆ సినిమా ఏదో కాదు..‘A’. నితిన్ ప్రసన్న హీరోగా ప్రీతి అస్రాని హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని యుగంధర్ ముని తెరకెక్కించారు. అవంతిక ప్రొడక్షన్స్ పతాకంపై గీతా మిన్సాల సినిమాను నిర్మించారు.
సినిమా ట్రైలర్‌ను విడుదల చేసిన విజయ్ సేతుపతిని ఇటీవలే ముంబైలో ‘A’ సినిమా చిత్ర బృందం కలిసి తమ సినిమాకు సపోర్ట్‌గా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా చిత్రంలోని కొంత భాగాన్ని చూసిన విజయ్ సేతుపతి సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని యూనిట్‌ను అభినందించారు.