మరో మైలురాయిని దాటిన Vijay... స్టార్ హీరో కొడుకు ఏమన్నాడంటే...

మరొక్క సంవత్సరం పూర్తైతే ఇళయదళపతి విజయ్ మూడు దశాబ్దాల మైలురాయిని చేరుకుంటాడు. ప్రస్తుతం కోలీవుడ్‌లోని మాస్ హీరోల్లో తిరుగులేని సూపర్ స్టార్‌గా కొనసాగుతోన్న ఆయన పరిశ్రమలోకి వచ్చి అప్పుడే 29 ఏళ్లు ముగిశాయి. తండ్రి సుదీర్ఘ సినీ ప్రస్థానం గురించి విజయ్ కొడుకు సంజయ్ సొషల్ మీడియాలో స్పందించాడు. 


‘‘సినీ పరిశ్రమలో 29 ఏళ్లు పూర్తి చేసుకున్నందుకు శుభాకాంక్షలు అప్పా! మీరు మీ చుట్టూ ఉన్న అందరికీ ఇన్నేళ్లుగా గొప్ప ప్రేరణగా నిలిచారు!’’ అన్నాడు విజయ్ తనయుడు సంజయ్. ట్విట్టర్‌లో తన తండ్రి ఇళయదళపతి ఫోటో ఒకటి షేర్ చేసిన ఆయన ‘‘మీతో నేను గడిపిన ప్రతీ క్షణం ఎంతో నేర్చుకుంటూనే ఉన్నాను. మీకు రానున్న కాలంలో మరింత విజయం, ఆనందం లభించాలని కోరుకుంటున్నాను’’ అని మనసులో మాట చెప్పాడు. తమ అభిమాన హీరో కోసం ఆయన వారసుడు స్పెషల్‌గా ట్వీట్ చేయటం విజయ్ ఫ్యాన్స్‌ని మరింత సంతోషంలో ముంచేసింది. ‘29 ఇయర్స్ ఆఫ్ విజయ్’ హ్యాష్ ట్యాగ్ ప్రస్తుతం సొషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది...  

Advertisement