డెయిరీ కార్మికులతో అధికారుల చర్చలు

ABN , First Publish Date - 2021-06-24T04:49:49+05:30 IST

విజయ డెయిరీ కార్మికులతో అధికారులు చర్చలు జరిపారు.

డెయిరీ కార్మికులతో అధికారుల చర్చలు
కార్మికులతో చర్చలు జరుపుతున్న అధికారులు

ద్వారకాతిరుమల, జూన్‌ 23: విజయ డెయిరీ కార్మికులతో అధికారులు చర్చలు జరిపారు. తమను అమూల్‌ డెయిరీలో కొనసాగించాలని కార్మికులు బుధవారం ధర్నా చేపట్టారు. అమూల్‌ పాల వాహనాలను అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న ఇన్‌చార్జి తహసీల్దార్‌ సుబ్బారావు, భీమడోలు సీఐ సుబ్బారావు, ఎస్‌ఐ సురేష్‌ సంఘటనా స్థలానికి చేరుకుని కార్మికులతో మాట్లాడారు. 15 సంవత్సరాలుగా డెయిరీలో పని చేస్తున్నామని, ఇప్పుడు తొలగిస్తే తమ కుటుంబాలు వీధిన పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా అధికారులు స్పందించి కార్మికులతో చర్చలు జరిపారు. సంస్థ ఎండీ దృష్టికి తీసుకువెళతామని, ఎటువంటి ఆందోళన కార్యక్రమాలు చేపట్టవద ్దని అధికారులు తెలిపారు. సీఐటీయూ నేత వై.సాల్మన్‌రాజు మాట్లాడుతూ కార్మికులు ఎటువంటి నష్టం కలగకుండా సమస్య పరిష్కరించాలని, అమూల్‌ సంస్థలో కార్మికులను కొనసాగించాలన్నారు. సీఐటీయు జిల్లా నాయకులు ప్రసాద్‌, లింగరాజు, ఎమ్మెల్సీ సాబ్జితో కలిసి కలెక్టర్‌ను కలుస్తామన్నారు. యూనియన్‌ నేతలు సీహెచ్‌ రవీంద్ర, కె.వెంకట్రావు, కార్మికులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-24T04:49:49+05:30 IST