నేటి నుంచి మార్కెట్లోకి విజయ ఐస్‌క్రీమ్‌!

ABN , First Publish Date - 2021-01-26T09:00:27+05:30 IST

తెలంగాణ విజయ డెయిరీ తన కొత్త ఉత్పత్తి ‘విజయ ఐస్‌ క్రీమ్‌’ను మంగళవారం సాయంత్రం 5.30 గంటలకు నాంపల్లి లలిత కళాతోరణంలో విడుదల చేయనుంది

నేటి నుంచి మార్కెట్లోకి విజయ ఐస్‌క్రీమ్‌!

హైదరాబాద్‌, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ విజయ డెయిరీ తన కొత్త ఉత్పత్తి ‘విజయ ఐస్‌ క్రీమ్‌’ను మంగళవారం సాయంత్రం 5.30 గంటలకు నాంపల్లి లలిత కళాతోరణంలో విడుదల చేయనుంది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, మంత్రులు తలసాని శ్రీనివాస్‌, మహమూద్‌ అలీ, ఇంద్రకరణ్‌రెడ్డి, శ్రీనివా్‌సగౌడ్‌, విజయడెయిరీ చైర్మన్‌ లోక భూమారెడ్డి పాల్గొంటారు. విజయ పేరుతో కుల్ఫీ, చాకోబార్‌, అమెరికానో, బెల్జియన్‌ డార్క్‌ చాకొలేట్‌, ఫ్రెంచ్‌ వెనీలా తదితర 30 రకాల ఫ్లేవర్లలో ఐస్‌ క్రీమ్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. 

Updated Date - 2021-01-26T09:00:27+05:30 IST