డీఎండీకే వ్యవస్థాపకుడు విజయకాంత్‌కు కరోనా

ABN , First Publish Date - 2020-09-24T23:09:21+05:30 IST

డీఎండీకే వ్యవస్థాపకుడు విజయకాంత్‌కు కరోనా

డీఎండీకే వ్యవస్థాపకుడు విజయకాంత్‌కు కరోనా

చెన్నై: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ రోజురోజుకూ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో డీఎండీకే వ్యవస్థాపకుడు విజయకాంత్‌కు కరోనా వైరస్ పాజిటివ్ వచ్చినట్లు వైద్య అధికారులు వెల్లడించారు. సెప్టెంబర్ 22న ఆయనకు కోవిడ్ -19 పరీక్షలు చేయడంతో కరోనా పాజిటివ్ వచ్చిందని మియాట్ ఇంటర్నేషనల్ గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. చెన్నైలోని మియోట్ ఆస్పత్రిలో విజయకాంత్‌కు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పూర్తిగా స్థిరంగా ఉన్నాడని, అతను పూర్తిస్థాయిలో కోలుకుంటాడని, త్వరలో డిశ్చార్జ్ చేస్తామని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. 


ఇంతకుముందు పార్టీ విడుదల చేసిన ఒక ప్రకటనలో విజయకాంత్‌కు కోవిడ్-19 యొక్క తేలికపాటి లక్షణాలు ఉన్నాయని చెప్పారు. విజయకాంత్ ఆరు నెలలకు ఒకసారి మియోట్ హాస్పిటల్లో రెగ్యులర్ చెక్-అప్ కోసం వెళతాడని, ఈసారి అతను కోవిడ్-19 యొక్క తేలికపాటి లక్షణాలతో గుర్తించబడ్డాడని తెలిపారు. ఆయన కోలుకున్నారని, ప్రస్తుతం ఆరోగ్యం బాగుందని పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి.

Updated Date - 2020-09-24T23:09:21+05:30 IST