Abn logo
Sep 25 2021 @ 23:24PM

తులసిరెడ్డిని పరామర్శించిన విజయమ్మ

వేంపల్లెలో తులసిరెడ్డిని పరామర్శిస్తున్న విజయమ్మ

వేంపల్లె, సెప్టెంబరు 25: బద్వేలు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకురాలు విజయ మ్మ టీడీపీ బద్వేలు ఉపఎన్నిక అభ్యర్థి ఓబుళాపురం రాజశేఖర్‌ శనివారం వేంప ల్లెలో పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డిని పరామర్శించారు. గోపవరం జడ్పీ టీసీని, మండల పరిషత్‌ను టీడీపీ కైవశం చేసుకున్నందుకు విజయమ్మను, నియోజకవర్గ టీడీపీ నేతలను తులసిరెడ్డి అభినందించారు.

కార్యక్రమంలో విజయమ్మ కుమారుడు, రితీష్‌కుమార్‌రెడ్డి, రాష్ట్రరైతు ప్రధాన కార్యదర్శి రమణా రెడ్డి,  టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, గోపవరం మండల ఉపాధ్యక్షుడు రామ్మోహన్‌రెడ్డి, బి.కోడూరు రామచంద్రారెడ్డి, రమణయా దవ్‌, ఎల్లారెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, శ్రీనివాసులరెడ్డి, కెవి సుబ్బారెడ్డి, శివయ్య, వేంప ల్లె కాంగ్రెస్‌ నేతలు నరసింహారెడ్డి, ఉత్తన్న, సుబ్బరాయుడు, అమర్‌ పాల్గొన్నారు.