AP: ప్రేయసిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన యువకుడు

ABN , First Publish Date - 2021-08-20T16:22:29+05:30 IST

జిల్లాలోని నెల్లిమర్ల నియోజకవర్గ పూసపాటి రేగ మండలం చౌడువాడలో దారుణం చోటు చేసుకుంది.

AP: ప్రేయసిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన యువకుడు

విజయనగరం: జిల్లాలోని నెల్లిమర్ల నియోజకవర్గ పూసపాటి రేగ మండలం చౌడువాడలో దారుణం చోటు చేసుకుంది. ప్రేయసిపై ఓ యువకుడు పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. ఈ అఘాయిత్యాన్ని అడ్డుకునేందుకు యత్నించడంతో ప్రేయసితో పాటు అక్క,  ఆమె కుమారుడికి గాయాలయ్యాయి. వెంటనే ముగ్గురిని జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2021-08-20T16:22:29+05:30 IST