జగన్ మాట మార్చరాదు...మడప తిప్పరాదు: ఆస్కారరావు

ABN , First Publish Date - 2020-11-22T17:42:33+05:30 IST

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. ఆస్కారరావు స్థానిక ఉద్యోగులతో ఆదివారం ఉదయం సమావేశమయ్యారు.

జగన్ మాట మార్చరాదు...మడప తిప్పరాదు: ఆస్కారరావు

విజయనగరం: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. ఆస్కారరావు స్థానిక ఉద్యోగులతో ఆదివారం ఉదయం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆస్కారరావు మాట్లాడుతూ.. పాదయాత్రలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో సీఎం జగన్ మాట మార్చరాదు- మడమ తిప్పరాదని అన్నారు. అర్హులైన కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యూలరైజ్ చేయాల్సిందే అని స్పష్టం చేశారు. సీపీఏస్ రద్దుతో పాటు పిఆర్సీ, పెండింగ్ డీఏ బకాయిలు చెల్లించాలని ఆస్కారరావు డిమాండ్ చేశారు. 

Updated Date - 2020-11-22T17:42:33+05:30 IST