విజయసాయి ప్రశ్నకు ఐటీ మంత్రి రాతపూర్వక జవాబు

ABN , First Publish Date - 2020-09-22T22:58:21+05:30 IST

చైనాకు చెందిన 224 మొబైల్‌ అప్లికేషన్లను కేంద్ ప్రభుత్వం నిషేధించినట్లు ఐటీ శాఖ

విజయసాయి ప్రశ్నకు ఐటీ మంత్రి రాతపూర్వక జవాబు

న్యూఢిల్లీ : చైనాకు చెందిన 224 మొబైల్‌ అప్లికేషన్లను కేంద్ ప్రభుత్వం నిషేధించినట్లు ఐటీ శాఖ సహాయ మంత్రి శ్రీ సంజయ్‌ ధోత్రే మంగళవారం రాజ్యసభకు వెల్లడించారు. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ దేశ సమగ్రత, సార్వభౌమతతోపాటు భద్రతను కాపాడేందుకు ఇటీ చట్టంలోని 69 ఏ సెక్షన్‌ కింద ఈ యాప్‌లు ప్రజలకు అందుబాటులోకి లేకుండా నిషేధించినట్లు తెలిపారు.


టిక్‌టాక్‌పై ప్రభుత్వం విధించిన నిషేధాన్ని ఆ సంస్థ ఈ ఏడాది జూలై 20న తెలంగాణ హైకోర్టులో సవాలు చేసినట్లు మంత్రి తెలిపారు. ఈ అప్పీలును విచారించిన హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చి పిటిషన్‌ను తోసిపుచ్చినట్లు చెప్పారు.

Updated Date - 2020-09-22T22:58:21+05:30 IST