దుబ్బాకలో చెల్లని హరీష్‌రావు హుజురాబాద్‌లో చెల్లుతాడా?: విజయశాంతి
ABN , First Publish Date - 2021-10-27T15:30:02+05:30 IST
మంత్రి హరీష్‌రావుపై బీజేపీ నాయకురాలు విజయశాంతి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. దళిత ఉద్యోగ బిడ్డను బూతులు తిట్టి కొట్టిన దళిత విద్రోహి హరీష్ రావు అంటూ మండిపడ్డారు.
హైదరాబాద్: మంత్రి హరీష్‌రావుపై బీజేపీ నాయకురాలు విజయశాంతి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. దళిత ఉద్యోగ బిడ్డను బూతులు తిట్టి కొట్టిన దళిత విద్రోహి హరీష్‌రావు అంటూ మండిపడ్డారు. నేడు హుజూరాబాద్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. హుజురాబాద్‌లో దళితులపై ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నాడన్నారు. గతంలో కేటీఆర్‌ని ఓడించాలని కుట్ర పన్నిందే హరీష్ రావు అని పేర్కొన్నారు. దుబ్బాకలో చెల్లని హరీష్‌రావు హుజురాబాద్‌లో చెల్లుతాడా? అని ప్రశ్నించారు.