బండి సంజయ్ పట్ల ప్రభుత్వ తీరు సరికాదు: విజయశాంతి

ABN , First Publish Date - 2022-01-03T20:40:41+05:30 IST

తెలంగాణ ప్రభుత్వం. సీఎం కేసీఆర్‌పై బీజేపీ సీనియర్ నేత విజయశాంతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

బండి సంజయ్ పట్ల ప్రభుత్వ తీరు సరికాదు: విజయశాంతి

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం. సీఎం కేసీఆర్‌పై  బీజేపీ సీనియర్ నేత విజయశాంతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం రాములమ్మ మీడియాతో మాట్లాడుతూ. ‘‘బండి సంజయ్ పట్ల ప్రభుత్వ తీరు సరికాదు. అడుగడుగునా బీజేపీ నేతలని అడ్డుకుంటున్నారు. తెలంగాణ తీసుకొచ్చింది..తెలంగాణ ప్రజల కోసం కాదట..కేసీఆర్ కుటుంబం కోసమా..?. మమ్మల్ని హౌజ్ అరెస్టులు చేస్తున్నారు.. 317 జీవో సవరణ చేయాలని బండి సంజయ్ దీక్షకి వెళ్తే అడ్డుకొని అరెస్ట్ చేశారు..నీ తప్పులు అగవు..నీకు శిక్ష పడుతుంది.. తెలంగాణను లూటీ చేశావ్.. కేసీఆర్ ఎవరెవరి మీద కేసులు పెట్టావో అన్నీ విషయాలు కేంద్రానికి తెలుసు. ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని కుట్ర చేస్తున్నారు...కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించండి.. బండి సంజయ్‌తో పాటు కార్యకర్తలపై పెట్టిన కేసులు ఎత్తివేయాలి..రాబోయే రోజుల్లో మా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం’’ అని విజయశాంతి టీఆర్ఎస్ సర్కారుపై మండిపడ్డారు. 


‘‘మమ్మల్ని కరీంనగర్ వెళ్లకుండా హౌస్ అరెస్ట్ చేశారు.. ఫోన్లు లాక్కుంటున్నారు..మీ మీటింగ్‌లకి కరోన ఉండదు.. బీజేపీ మీటింగ్‌లకు కరోన ఉంటాదా..?. టీఆర్ఎస్ కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయి.. బీజేపీ దీక్ష చేసిన రోజే కాంగ్రెస్ చేస్తుంది.. మహిళల చీరలు లాగారు.. కార్యకర్తలను లాఠీలతో కొట్టారు. రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగుల సమస్యలతో అందరూ బయటకు వస్తున్నారు. సమస్యలను పక్క దారి పట్టిస్తున్నారు.. బండి సంజయ్‌తో పాటు, కార్యకర్తలపై పెట్టిన కేసులు ఎత్తివేయాలి. ఫాంహౌస్‌ బావిలో పడి చనిపోయిన వ్యక్తి బయటకు రాడు.. నరబలి ఇస్తున్నారా..? కేసీఆర్ ప్రభుత్వం వల్ల తెలంగాణలో ఎవరు సంతోషంగా లేరు.. రాష్ట్రం చావుల తెలంగాణగా మారింది.. టీఆర్ఎస్ ప్రజావ్యతిరేక విధానాలపై కేంద్రానికి రిపోర్ట్స్ వెళ్లాయి.. కేంద్రం తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటుంది’’ అని .. విజయశాంతి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. 

Updated Date - 2022-01-03T20:40:41+05:30 IST